ఎమ్మెల్యేకు చెందిన ఇంట్లో ఆత్మహత్య: బ్యాంకులో చోరీ

Kadapa District
మహబూబ్‌నగర్/గుంటూరు: మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్‌‌లో ఎమ్మెల్యేకు చెందిన ఓ ఇంటిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వేశ్వరప్ప అనే అరవయ్యేళ్ల వ్యక్తి ఎమ్మెల్యేకు చెందిన ఇంటిలో ఉరేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని షాద్ నగర్ ఆసుపత్రికి తరలించారు.

ప్రయివేటు బస్సులో అగ్ని ప్రమాదం

గుంటూరు జిల్లాలో ఓ ప్రయివేటు బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. డ్రైవర్ అప్రమత్తంతో ప్రయాణీకులు ప్రాణాలతో బయటపడ్డారు. పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించిన డ్రైవర్ ప్రయాణీకులను వెంటనే కిందకు దించాడు.

ప్రేమజంట ఆత్మహత్యయత్నం

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా, ప్రియుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గౌరీశ్వరి అనే ఇరవయ్యేళ్ల యువతి రమేష్ అనే 26 ఏళ్ల వ్యక్తి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రమేష్‌కు అప్పటికే పెళ్లైంది. సోమవారం అర్ధరాత్రి సమయంలో వీరిద్దరు ఆత్మహత్యకు యత్నించారు.

బ్యాంకులో రూ.18 లక్షలు చోరీ

కడప జిల్లా రాజంపేటలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో భారీ దోపీడి జరిగింది. బ్యాంకు వెనుక వైపు కిటికీకి గ్రిల్స్ తొలగించి లోపలికి వెళ్లిన దొంగలు బీరువాను పగులగొట్టి అందులో ఉన్న రూ.18 లక్షలు అపహరించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వ్యక్తి సజీవ దహనం

హైదరాబాదులోని దిల్‌సుఖ్‌నగర్ వికాస్ నగర్‌లో వరసిద్ధి అపార్టుమెంటులో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు.

కారు - లారీఢీ, ఇద్దరి మృతి

అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి సమీపంలో లారీ, కారు ఢీకొంది. ఈ ఘటనలో దంపతులు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+