షర్మిల యాత్రలో బస్సుపై నుండి పడ్డ నేత మృతి

షర్మిల సమైక్య శంఖారావ బస్సు యాత్ర రెండు రోజుల క్రితం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాగింది. ఈ యాత్రలో పాల్గొన్న సుధాకర్ రెడ్డి బస్సు పై నుండి కింద పడ్డారు. తీవ్ర గాయాలైన అతనిని చికిత్స కోసం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.
కాగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావ యాత్ర కావలి నుంచి మంగళవారం ప్రారంభమైంది. ఈ రోజు ఆమె కనిగిరి, మార్కాపురంలలో పర్యటిస్తారు. ఉదయం పదకొండు గంటలకు కనిగిరి బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు.
ఆ తర్వాత మార్కాపురం వెళ్తారు. అక్కడ సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా, కోడూరు సుధాకర్ రెడ్డి మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు షర్మిల సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications