ఢిల్లీ గ్యాంగ్ రేప్: దోషులుగా నిర్ధారించిన కోర్టు, రేపు శిక్ష

 Nirbhaya gang rape: Four accused have been found guilty of rape and murder
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో గతేడాది డిసెంబర్‌లో జరిగిన నిర్భయ అత్యాచారం కేసులో నలుగురు నిందితులను సాకేత్ కోర్టు మంగళవారం దోషులుగా నిర్ధారించింది. వారికి శిక్షను కోర్టు బుధవారం ఖరారు చేసే అవకాశముంది. అంతకుముందు శిక్షపై వాదనలు విననుంది. ముఖేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్‌లను కోర్టు దోషులుగా నిర్ధారించింది.

ఈ రోజు ఉదయం ఢిల్లీ పోలీసులు వారిని కోర్టులో ప్రవేశ పెట్టారు. ఉదయం పదిన్నర గంటలకు తీర్పు వెలువడాల్సి ఉండగా, రెండు గంటలు ఆలస్యంగా పన్నెండున్నర గంటలకు వెలువడింది. ముగ్గురిని దోషులుగా నిర్ధారించిన కోర్టు, రేపు శిక్ష పైన వారి వాదనలు విని, ఖరారు చేసే అవకాశముంది. శిక్ష పైన వాదనలు రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కానున్నాయి. నిందితులపై అత్యాచారం, హత్య, అపహరణ, దోపిడీ తదితర పదమూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితులు అరెస్టైన విషయం తెలిసిందే. అందులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ ఇటీవలే జైలులో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్ కావడంతో జువైనల్ కోర్టు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. మిగిలిన నలుగురిని కోర్టు దోషులుగా ఈ రోజు తీర్పు చెప్పింది.

ఉరివేయాలని కుటుంబ సభ్యుల డిమాండ్

నిర్భయ కుటుంబ సభ్యులు, పలు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఈ రోజు కోర్టుకు వచ్చాయి. దోషులను కఠినంగా శిక్షించాలని, వారికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. దోషులను ఉరి వేయకుంటే నిర్భయ చట్టం రూపకల్పనకు అర్థమే ఉండదని మహిళా సంఘాలు, కుటుంబ సభ్యులు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+