నదిలో పడిన ఓవర్ లోడెడ్ బస్సు: 44మంది మృతి

ప్రమాదం జరగడంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీస్తున్న అధికారులు వాటిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. గాయపడ్డ 46 మందిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు అగ్ని ప్రమాదక శాఖకు చెందిన మారియో క్రూజ్ అన్నారు.
ఘటన జరిగినప్పుడు దాదాపు 90 మంది వరకు ప్రయాణీకులు ఉండి ఉంటారని సదరు అధికారి చెప్పారు. కాగా, బస్సు సామర్థ్యం మాత్రం 54 మాత్రమే. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ కూడా మృతి చెందాడు. పలువురిని రక్షించామని, ఇంకొందరు బస్సు నదిలో పడుతుండగా బయటకు దూకేశారని అధికారి చెప్పారు.
ప్రమాదం జరిగిన వెంటనే దగ్గరలోని ప్రజలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ముగ్గురు బేబీస్ ఉన్నారు. బస్సు 200 మీటర్ల ఎత్తు నుండి స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 8.15 నిమిషాలకు నదిలో పడింది.












Click it and Unblock the Notifications