ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ తగ్గిన ఉష్ణోగ్రతలు... పెరిగిన చలి తీవ్రత.. ఆదిలాబాద్‌లో 8 డిగ్రీలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Cold Wave In Telangana : Lowest Temperature Recorded In Adilabad | Oneindia Telugu

ఈ ఏడాది చలికాలం వింతైన అనుభవాలు చూపిస్తోంది. చలికాలం ప్రారంభమైన మొదట్లో అంతగా ప్రభావం చూపలేదు. దీంతో ఈసారి చలి తక్కువగా ఉంటుందని చాలామంది భావించారు. అయితే పెథాయ్ తుపాను తర్వాత చలికాలం ట్రెండ్ మారింది. ఎన్నడూలేనంతగా తెలంగాణలోని కొన్నిచోట్ల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. నార్మల్ చలి ఉండే ప్రాంతాల్లోని ప్రజలు సైతం ఈ సంవత్సరం గజగజ వణికారు.

cold increased due to temperature comes down

పెథాయ్ తుపాన్ కారణంగా చలితో అల్లాడిన తెలంగాణ ప్రజలకు గత వారం ఉపశమనం లభించినట్లైంది. అంతలోనే మళ్లీ చలి తీవ్రత ఎక్కువైంది. రెండు రోజుల నుంచి కొన్నిప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మంగళవారం తెల్లవారుజామున ఆదిలాబాద్ లో అత్యల్పంగా 8 డిగ్రీల టెంపరేచర్ నమోదయింది.

సర్పంచ్ కుర్చీలకు వేలం...! ఎన్నికల సంఘం సీరియస్... ఏకంగా జైలుశిక్షే సర్పంచ్ కుర్చీలకు వేలం...! ఎన్నికల సంఘం సీరియస్... ఏకంగా జైలుశిక్షే

హైదరాబాద్ లో 14, హన్మకొండలో 13, రామగుండంలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మామూలు వాతావరణం కన్నా 3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉండటంతో చలి పెరిగి పొగమంచు కురుస్తోంది. మారిన వెదర్ కారణంగా బుధ, గురువారాల్లో కూడా చలి ఈవిధంగానే ఉండనున్నట్లు సమాచారం.

English summary
cold increased due to temperature comes down in telangana. cold is very high in some areas from two days. The lowest temperature of 8 degrees was recorded in Adilabad on Tuesday. It is reported that the cold will be high on Wednesday and thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X