ఎక్కడ లైంగిక దాడి జరిగినా.. వైసీపీ కార్యకర్తల ప్రమేయం.. టీడీపీ నేత అనిత
జగన్ సర్కార్‌పై టీడీపీ నేత అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని కామెంట్ చేశారు. ఎక్కడ ఏ అరాచకం జరిగినా.. లైంగిక దాడి జరిగినా.. అందులో వైసీపీ క్యాడర్ పాత్ర ఉంటుందని ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. రాష్ట్రంలో మహిళలకు బొత్తిగా రక్షణ లేకుండా పోతుందని ఆమె కామెంట్ చేశారు. జరుగుతున్న.. జరిగిన పరిణామలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తగిన సమయం చూసి బుద్ది చెబుతారని వివరించారు.
జగన్ పాలనలో మహిళల మాన, ప్రాణాలకు విలువే లేకుండా పోతోందని అనిత విమర్శించారు. మైనర్ బాలికలపై కూడా అత్యాచారాలు జరుగుతుందడం దారుణమని అన్నారు. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగి రెండు నెలలు గడుస్తున్నా... బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదని మండిపడ్డారు. ఆ చిన్నారిపై కన్నా భూశంకర్ అనే వైసీపీ కార్యకర్త అత్యాచారం చేశాడని చెప్పారు. హోం మంత్రి సుచరిత నిస్సహాయ శాఖ మంత్రిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని అడిగారు.

రాష్ట్రంలో ఎక్కడ అత్యాచారం జరిగినా వైసీపీ నేతల హస్తం ఉంటోందని అనిత ఆరోపించారు. అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించేందుకు వస్తే... అక్కడ ఆ అమ్మాయి లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలిని కలిసేందుకు అనుమతిని ఇవ్వాలని పోలీసులను కోరుతున్నామని చెప్పారు. బలహీనవర్గాలకు చెందిన మహిళలను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బలమైన సామాజిక వర్గం జోలికి రావడం లేదని.. బలహీనులపై ప్రతాపం చూపిస్తున్నారని వివరించారు.
అసలు రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. రాష్ట్రంలోకి పరిశ్రమలు రావడం లేదని తెలిపారు. ఎందుకో అందరికీ తెలుసు అని చెప్పారు. కానీ డ్రగ్స్, గంజాయి మాత్రం యథేచ్చగా వచ్చాయని అన్నారు. జగన్‌కు మహిళలు బుద్ధి చెప్పే సమయం త్వరలో వస్తుందని అనిత ధీమా వ్యక్తం చేశారు. వడ్డీతో సహా లెక్క సరిచేస్తామని హెచ్చరించారు. జనాలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని.. ఇక టీడీపీ కార్యకర్తలపై దాడులు మాత్రం ఆగడం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications