చంద్ర‌బాబు అడ్డంగా దొరికారు : ల‌గ‌డ‌పాటి దొంగ స‌ర్వేలు వ‌స్తాయి: శ‌ంఖం పూరించిన జ‌గ‌న్..!

ఎన్నిక‌ల‌కు వైసిపి అధినేత కాకినాడ వేదిక‌గా స‌మ‌ర శంఖం పూరించారు. ఎన్నిక‌లకు కార్య‌క‌ర్త‌లు స‌మాయ‌త్తం కావాల ని..అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు చేసే కుట్ర‌ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా తిప్పి కొట్టేందుకు సిద్దంగా ఉండాల‌ని సూచించా రు. ఇక‌, ల‌గ‌డ‌పాటి లాంటి వారు దొంగ స‌ర్వేల‌తో ముందుకు వ‌స్తార‌ని చెప్పుకొచ్చారు. విశ్వ‌స‌నీయ‌తకు...వంచ‌న‌కు మ‌ధ్య జ‌రుగుతున్న ఎన్నిక‌లుగా వీటిని ప్రచారం చేయాల‌ని పిలుపునిచ్చారు.

చంద్ర‌బాబు ఎవ‌రు స‌మాచారం ఇవ్వ‌టానికి..

చంద్ర‌బాబు ఎవ‌రు స‌మాచారం ఇవ్వ‌టానికి..

ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ ఒన్ అవినీతిప‌రుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అని వైసిప అధినేత జ‌గ‌న్ ఆరోపించారు. ప్ర‌జ‌ల ఓట్లు తీయించేసిన సైబ‌ర్ క్రిమిన‌ల్ అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా వారి ఆధార్‌, బ్యాంకు స‌మాచారాన్ని ప్ర‌యివేటు కంపెనీల‌ను ఇవ్వ‌టానికి చంద్ర‌బాబు ఎవ‌ర‌ని నిల‌దీసారు. వైసిపి కి మ‌ద్దతుగా ఉన్న వారి వివ‌రాలు సేక‌రించి వారితో బేరాలు ఆడుతున్నార‌ని విమ‌ర్శించారు. సామాజిక వ‌ర్గాల వారీగా ఓట్ల తొలిగిం పు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. చంద్ర‌బాబు ను సైబ‌ర్ క్రిమిన‌ల్ గా జ‌గ‌న్ అభివ‌ర్ణించారు. ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త డేటాను దొంగిలించార‌ని ఆరోపించారు. ఇవ‌న్నీ జైలుకు వెళ్లే క్రిమిన‌ల్ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ల‌గ‌డ‌పాటి లాంటి వారు వ‌స్తారు..

ల‌గ‌డ‌పాటి లాంటి వారు వ‌స్తారు..

ఇక‌, టిడిపికి అనుకూలంగా స‌ర్వేలు ఉన్నాయ‌ని చెబుతూ..మైండ్ గేమ్ ను ర‌క్తి క‌ట్టించ‌టానికి ల‌గ‌డ‌పాటి లాంటి వారు స‌ర్వేల పేరుతో తెర మీద‌కు వ‌స్తార‌న్నారు జ‌గ‌న్. వారి దొంగ స‌ర్వేల‌తో..ఎల్లో మీడియా ప్ర‌చారంతో ప్ర‌జ‌ల‌ను అయోమ యం సృష్టించ‌టానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు. అయితే, తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో ల‌గ‌డ‌పా టి త‌న స‌ర్వే పేరుతో టిడిపి-కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు గా ఫ‌లితాలు ఉంటాయ‌ని చెప్పి..ఆ త‌రువాత ఫలితాల త‌రువాత అడ్ర‌స్ లేకుండా పోయార‌న్నారు. ఓట్లు తీసేస్తూ..దొంగ ఓట్లు చేరుస్తూ ముఖ్య‌మంత్రి అడ్డంగా దొరికిపోయార‌ని జ‌గ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. రెండున్నారేళ్లుగా చంద్ర‌బాబు ఈ వ్య‌వ‌హారం న‌డుపుతున్నార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు.

విశ్వ‌స‌నీయ‌త‌కు..వంచ‌న‌కు మ‌ధ్య ఎన్నిక‌లు

విశ్వ‌స‌నీయ‌త‌కు..వంచ‌న‌కు మ‌ధ్య ఎన్నిక‌లు

ఈ ఎన్నిక‌ల్లో విశ్వ‌స‌నీయ‌త‌కు..వంచ‌న కు మ‌ధ్య జ‌రుగుతున్న ఎన్నిక‌లు అని జ‌గ‌న్ అభివ‌ర్ణించారు. 50 లక్ష‌ల‌కు పై గా ఓట్ల‌ను తొలిగించే ప్ర‌య‌త్నం చేస్తే..వైసిపి నేత‌లు ఫారం-7 ద్వారా అడ్డుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని వివ‌రించా రు. గ‌త ఎన్నిక‌ల్లో టిడిపి-బిజెపి-ప‌వ‌న్ క‌లిసినా వారికి - వైసిపికి వ‌చ్చిన ఓట్ల తేడా అయిదు ల‌క్ష‌లు మాత్ర‌మేన‌ని గుర్తు చేసారు. ప్ర‌తీ కార్య‌క‌ర్త ప్ర‌తీ ఇంటికి వెళ్లి ఓటు ఉందో లేదో ప‌రిశీలించాల‌ని..లేని వారికి ఓటు చేర్చే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఇక ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబు గ్రామాల‌కు డ‌బ్బుల మూట‌లు పంపుతార‌ని..అధికార పార్టీ దౌర్జ‌న్యాల‌తో పాటుగా ఎల్లో మీడియాను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని జ‌గ‌న్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+