అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరిగి సొంత గూటికే : ఇక్క‌డ అవ‌కాశం దొరికేనా..!

|
Google Oneindia TeluguNews

అనంత‌పురం మాజీ ఎమ్మెల్యే గురునాధ్ రెడ్డి తిరిగి సొంగ గూటికి చేరారు. వైసిపి ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రించిని ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఆ త‌రువాత జిల్లాకు చెందిన టిడిపి నేత జెసి మ‌ద్ద‌తు తో టిడిపిలో చేరారు. కానీ, చేరిక స‌మ‌యం లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌టంతో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.

వైసిపిని వీడి...ఇప్పుడు మ‌ళ్లీ సొంత గూటికే..

వైసిపిని వీడి...ఇప్పుడు మ‌ళ్లీ సొంత గూటికే..

అనంత‌పురం ఆర్బ‌న్ మాజీ ఎమ్మెల్యే గుర్నాధ‌రెడ్డి తిరిగి వైసిపి లో చేరారు. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి.. ఆయన సమక్షంలో గురునాథ్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరా రు. ఈ సందర్భంగా గురునాథ్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి.. వైఎస్‌ జగన్‌ స్వాగతం పలికారు.

జ‌గ‌న్ కాంగ్రెస్ ను వీడి సొంతం గా పార్టీ ఏర్పాటు చేసిన స‌మ‌యంలో జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా నిలిచిన వారిలో గుర్నాధ‌రెడ్డి ఒక‌రు. అయితే, 2014 ఎన్నిక‌ల్లో వైసిపి నుండి అనంత‌పురం అర్బ‌న్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌రువాత పార్టీలో కొన‌సాగుతున్నా.. అధికార పార్టీ లో చేరాల‌నే ఒత్తిడి పెరిగింది. ఫ‌లితంగా అనంత‌పురం ఎంపి జేసి దివాక‌ర రెడ్డి మ‌ద్ద‌తుతో టిడిపిలో చేరారు.

అనంత లో స్థానిక ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర చౌద‌రి తో ఉన్న విభేదాల కార‌ణంగా జేసి దివాక‌ర రెడ్డి..వైసిపి నుండి గుర్నాధ రెడ్డిని టిడిపి లో చేర్చి..సీటు ఇప్పించాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ, టిడిపి లో చేరే స‌మ‌యంలో నామినేటెడ్ పోస్టు పై హామీ ఇచ్చారు..

మిర్చిలో కొత్త ఫంగ‌స్ : అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిక‌.. మిర్చిలో కొత్త ఫంగ‌స్ : అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిక‌..

పోస్టు ద‌క్క‌క‌..ప్రాధాన్య‌త లేక‌..

పోస్టు ద‌క్క‌క‌..ప్రాధాన్య‌త లేక‌..

టిడిపిలో చేరిన త‌రువాత గుర్నాధ రెడ్డికి త‌న‌కు ఇచ్చిన హామీని అమ‌లు చేయాల‌ని ప‌లు మార్లు జేసి ద్వారా ఒత్తిడి తెచ్చారు. కానీ, ప‌లితం లేదు. దీని పై జేసి సైతం ప‌లు మార్లు టిడిపి అధినాయ‌క‌త్వం వద్ద ఒత్తిడి పెంచారు. అయితే జిల్లాలో ఉన్న స‌మీక‌ర‌ణాలు..వ‌ర్గాల కార‌ణంగా గుర్నాధ‌రెడ్డికి ఇచ్చిన హామీ నెర‌వేర‌లేదు. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో త‌న‌కు ఇక టిడిపిలో ప్రాధాన్య‌త ద‌క్కే అవ‌కాశం లేద‌ని గుర్నాధ‌రెడ్డి గుర్తించారు.

గుర్నాధ‌రెడ్డి వైసిపిని వీడి టిడిపిలో చేరే స‌మ‌యంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు గా నిలిచిన నేత‌ల్లో ఒక‌రైన గుర్నాధ‌రెడ్డితో స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల త‌రువాత మ‌రింత గ్యాప్ పెరిగింది. అయితే, ఇప్పుడు తిరిగి వైసిపి లోకి వ‌చ్చినా..పార్టీ ద‌క్కే అవకాశం క‌నిపించ‌టం లేదు. అనంత‌పురం అర్బన్ నుండి ఇప్ప‌టికే మాజీ ఎంపి అనంత వెంక‌ట్రామిరెడ్డి అభ్య‌ర్ధిగా త‌న ప‌ని తాను చేసుకుంటున్నారు. దీంతో..గుర్నాధ రెడ్డికి మరోచోట నుండి ఛాన్స్ ద‌క్కుతుందా అంటే ఆదీ అనుమాన‌మే..

వైసిపి కండువా..బాబు పై ఫైర్‌..

వైసిపి కండువా..బాబు పై ఫైర్‌..

వైసిపి నుండి టిడిపి...ఇప్పుడు టిడిపి నుండి వైసిపి లో చేరిన గుర్నాధ‌రెడ్డి ముఖ్య‌మంత్రి పై ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోగా.. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడం నచ్చకనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గురునాథ్‌రెడ్డి ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

రాష్ట్రం అభివృద్ధితోపాటు జిల్లా అభివృద్ధి చెందుతుందన్న ఆశతోనే ఆనాడు తాను టీడీపీలో చేరాను తప్ప...తన స్వప్రయోజనాలు, పదవులను ఆశించి పోలేదని ఆయన వివరణ ఇచ్చారు. ఈ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. కేవలం సొంత అభివృద్ధే అజెండాగా బాబు పని చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. పార్టీ ని గెలిపించేందుకు ప‌ని చేయాల‌ని జ‌గ‌న్ సూచించిన‌ట్లు తెలుస్తోంది.

English summary
ex MLA Gurunatha Reddy rejoin in YSRCP. In presence of Jagan he joined in party. he may note get ticket form Anantapur YCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X