ఏపీలో యువ ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ - మద్దతెవరికి..!!
ఏపీలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. పార్టీలు ఓటర్ల మద్దతు కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు పోలింగ్ కోసం ఎన్నికల సంఘం తుది ఏర్పాట్లలో ఉంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ కొనసాగుతోంది. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ ఓటర్లు సొంత ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఈ సారి ఏపీలో కొత్తగా ఓటు వేయనున్న యువత ఫలితంలో కీలకంగా మారుతోంది. ఎవరి వైపు యువత నిలవనుంది.
ఈ సారి కొత్తగా లక్షల మంది యువఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏపీలో 10లక్షల 30 వేల మంది యువ ఓటర్లు..తొలి సారి ఓటు వేయబోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యువ ఓటర్ల రిజిస్ట్రేషన్లు ఈ సారి ఎక్కువగా ఉన్నాయి. తొలి సారి ఓటు వేస్తున్న వీరి ప్రభావం ఫలితాలపై ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికర అంశంగా మారింది.

వీరిలో ఎక్కువగా విద్యర్దులు, ప్రయివేటు ఉద్యోగాలు చేసుకుంటున్నవారు..ఇతర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న వారు ఉన్నారు. ఏపీలో కొనసాగుతున్న రాజకీయ యుద్దంలో ఎవరి విధానాలకు వీరి మద్దతు లభిస్తుందనేది కీలకంగా మారనుంది. వీరి ఓటింగ్ పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
ఓటర్ల లెక్కలు చూస్తే..రాయలసీమలోని కర్నూలు జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉండగా..ఉత్తరాంధ్రలోని అల్లూరి జిల్లా అత్యల్ప ఓటర్లు ఉన్నారు. కర్నూలు జిల్లాలో 20 లక్షల 16 వేల 396 మంది ఓటర్లుండగా ..అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 7 లక్షల 61 వేల 568 మంది ఓటర్లు ఉన్నారు.
154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 70 నియోజకవర్గాల్లో పురుషుల కంటే అయిదు వేల నుంచి పది వేల వరకు ఎక్కువగా ఉన్నట్లు ఎన్నికల సంఘం లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సారి పోలింగ్ లో యువత..మహిళలతో పాటుగా సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. దీంతో..భారీ పోలింగ్ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications