విషాదం: మూడేళ్ల అనన్యను చంపేసిన వీధి కుక్కలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వీధీ కుక్కలు ఓ మూడేళ్ల బాలికపై దాడి చేసి ఆమెను చంపేశాయి. మృతురాలిని కామ అనన్యగా గుర్తించారు.
కృష్ణా జిల్లాలోని వేములపల్లి గ్రామ శివారులో ఉన్న తన ఇంటి వద్ద ఆడుకుంటుండగా అనన్యపై పది కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఆమెను సమీపంలోని పొలాల్లోకి లాక్కుని వెళ్లి, దాడి చేశాయి.

బాలిక కేకలు విన్న గ్రామస్తులు సంఘటన స్థలానికి హుటాహుటిన వెళ్లారు. కుక్కలు తరిమికొట్టారు. అయితే, అమ్మాయిని మాత్రం కాపాడలేకపోయారు. ఆమె మృతదేహాన్ని కుక్కలు ముక్కలుగా చేసి, అవి చెల్లచెదురుగా పడి ఉన్నాయి.
దినసరి కూలీలైన బాలిక తల్లిదండ్రులు తన కూతురి దారుణమైన మరణాన్ని చూసి కుప్పకూలిపోయారు. తీవ్రంగా ఆగ్రహించిన గ్రామస్థులు కుక్కల కోసం వేట సాగించారు.












Click it and Unblock the Notifications