'30వ వరద వార్షికోత్సవం' నిరసన: చిరును అడ్డగించారు
రాజమండ్రి/విశాఖ: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. రాజకీయ నాయకులు వరద బాధిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు గ్రామంలో ఈబిసి కాలనీవాసులు వినూత్న నిరసన తెలిపారు.
తమ కాలనీకి పరామర్శించేందుకు వచ్చే రాజకీయ నాయకుల కోసం వారు వినూత్న ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 30వ వరద వార్షికోత్సవం అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం వరద బాధితులను పరామర్శించేందుకు వస్తున్న ప్రజాప్రతినిధులకు స్వాగతం అంటూ అందులో రాశారు.

గత ముప్పై ఏళ్లుగా తమ ప్రాంతం వరద నీటితో నిండిపోతోందని, ప్రతి ఏటా రాజకీయ నాయకులు వచ్చి తమను పరామర్శించి వెళ్లడమే తప్ప చేసిందేమీ లేదని అందుకే నిరసనగా ఇలా 30వ వరద వార్షికోత్సవం అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్లు బాధితులు చెబుతున్నారు.
చిరంజీవిని అడ్డుకున్న వరద బాధితులు
విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని వరద బాధితులు అడ్డుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన చిరును వరద సహాయచర్యలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బాధితులు అడ్డుకున్నారు. ఆదివారం కేంద్రమంత్రి పళ్లం రాజును కూడా బాధితులు అడ్డుకున్నారు.
సిఎం సమక్షంలో పనబాకకు షాక్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకాశం జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన వెంట కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఉన్నారు. ఆమెకు సిఎం సమక్షంలోనే సమైక్య సెగ తగిలింది. సీమాంధ్ర ద్రోహి పనబాక గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications