కుక్కల దాడిలో నాలుగేళ్ళ ఇబ్రహీం మృతి
ర్నూల్: కర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో మంగళవారం సాయంత్రం కుక్కల దాడిలో నాలుగేళ్ళ ఇబ్రహీం మృత్యువాత పడ్డాడు. తాము పనిచేసే ప్రాంతానికి తల్లిదండ్రులు ఇబ్రహీం ను తీసుకెళ్ళారు. అయితే అక్కడ రెండు కుక్కలు దాడి చేయడంతో ఇబ్రహీం మృత్యువాత పడ్డాడు.
కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామానికి చెందిన నాలుగేళ్ల ఇబ్రహీంను తీసుకొని తల్లి దండ్రులు హుస్సేన్ పీరా, చాంద్‌బీ దంపతులకు పంట నూర్పిడి పనులకు వెళ్ళారు. పంట నూర్పిడి పనుల్లో వారంతా నిమగ్నమయ్యారు.

అయితే పొలం దగ్గర ఊయలను ఏర్పాటు చేసి ఇబ్రహీంను అందులో పడుకోబెట్టారు. రెండు కుక్కలు వచ్చి ఇబ్రహీంను పీక్కుతిన్నాయి. పంట నూర్పిడి యంత్రం శబ్దానికి బాలుడి అరుపులు విన్పించలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.
తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళేసరికి ఇబ్రహీం ముఖాన్ని కుక్కలు చిధ్రం చేశాయి. బిడ్డ మరణించడంతో తల్లి చాంద్‌బీ సొమ్మసిల్లి పడిపోయింది. ఇంట్లో వదిలేసి వస్తే రక్షణ ఉండదని తమ వెంట తీసుకొచ్చి ఇబ్రహీంను చంపేసుకొన్నామని ఆ తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications