టి: 9024 ప్రతిపాదనలు, శంకరన్న ఫైర్, కిరణ్ నవ్వులు
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై 9,024 సవరణ ప్రతిపాదనలు అందాయని శాసన సభ సభాపతి నాదెండ్ల మనోహర్ శనివారం ప్రకటించారు. ఈ సవరణల ప్రతులను సభ్యులకు సోమవారం అందజేయనున్నట్టు తెలిపారు. ఇటీవల సభాపతి సవరణపై కోరిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రిపై శంకర రావు ఆగ్రహం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసన సభ్యులు శంకర రావు సభలోనే తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి నవ్వుతూ విన్నారు తప్ప ప్రతిస్పందించలేదు. కిరణ్ కేవలం సీల్డ్ కవర్ ద్వారా మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారన్నది మరచిపోవద్దన్నారు. మంత్రి శైలజానాథ్ చేసిన పలు వ్యాఖ్యలను కూడా శంకర రావు తప్పుపట్టారు. మెడలు వంచి అయినా ఓటింగ్‌కు వెళ్తామన్న శైలజానాథ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

అసలు శైలజానాథ్ అలా మాట్లాడడానికి వెనుక కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎవరన్నది ప్రజలకు తెలుసునని, ముఖ్యమంత్రి కిరణ్ ప్రేరణ శైలజానాథ్ మాటల వెనుక ఉందని అన్నారు. బిల్లును కేవలం చర్చ కోసమే శాసనసభకు పంపించారు తప్ప ఓటింగ్ కోసం కాదన్నారు. అలా మాట్లాడిన శైలజానాధ్‌కు మంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా కేవలం చిత్తూరు జిల్లాకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రోడ్ మ్యాప్ ఉంది: డిఎస్
తెలంగాణపై అడ్డంకులు సృష్టించేందుకు ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్ర విభజన ఆగదని డి శ్రీనివాస్ అన్నారు. ఈ విషయంలో అధిష్టానానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉందన్నారు. విభజన తథ్యమని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీపై స్పందిస్తూ వస్తుందేమో అన్నారు.












Click it and Unblock the Notifications