అందంగా లేదని భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు

వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా భార్య శిరీషతో ప్రకాష్ తరచూ గొడవపడుతున్నాడు.
మొగల్రాజపురంలోని తమ నివాసంలో సోమవారం రాత్రి 11గంటల వరకు భార్య శిరీషతో ప్రకాష్ గొడవ పడ్డాడు. ఆ తర్వాత శిరీష నిద్రిస్తున్న సమయంలో ప్రకాష్ ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.
దీంతో ఒక్కసారి లేచిన శిరీష తన భర్త ప్రకాష్‌ను పట్టుకుంది. దీంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. శిరీషకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వారిని వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
80శాతం కాలినగాయాలతో శిరీష ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. స్వల్ప గాయాలైన ప్రకాష్ కోలుకుంటున్నాడు. కాగా, మరో అమ్మాయితో వివాహం కోసమే ప్రకాష్.. శిరీషను వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. శిరీష హత్యకు ప్రకాష్ తోపాటు అతని కుటుంబ సభ్యులు కుట్ర పన్నారని బాధితురాలి బంధువులు ఆరోపించారు. వీరిద్దరికి రెండేళ్ల క్రితం వివాహం జరిగిందని చెప్పారు.
టెక్కలిలో ప్రేమజంట ఆత్మహత్య
శ్రీకాకుళం: జిల్లాలోని టెక్కలిలో ఓ ప్రేమజంట బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తమ పెళ్లికి పెద్దలు నిరాకరించారనే కారణంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications