కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్నం పెట్టలేదని కన్నతల్లి హత్య: ఇల్లు అమ్మేసిందని..

|
Google Oneindia TeluguNews

A man allegedly killed his mother
నల్గొండ/కరీంనగర్: కన్నతల్లినే కుమారులు దారుణంగా హత్య చేసిన ఘటనలు నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. తనకు తెలియకుండా ఇల్లు అమ్మిందని ఒకరు, అన్నం పెట్టడంలేదని మరొకరు కొట్టిచంపారు. మొదటి ఘటన వివరాలిలా ఉన్నాయి.. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని శివాజీనగర్‌కు చెందిన పుప్పాల కళమ్మ (45) భర్త 12 ఏండ్ల క్రితం మృతి చెందాడు. వీరికి కొడుకు సతీశ్, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. నాలుగేండ్ల క్రితం సతీశ్ కులాంతర వివాహం చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

కుమార్తెకు పెళ్లి చేసిన కళమ్మ స్థానికంగా తన తల్లిదండ్రులకు చెందిన స్థలంలో రెండు గదుల రేకుల ఇల్లు నిర్మించుకుని ఉంటోంది. తొమ్మిది నెలల క్రితం సతీశ్ తల్లి వద్దకు రాగా రాజేశ్వరి పెండ్లికి, ఇంటి నిర్మాణానికి అప్పులయ్యాయని చెప్పింది. ఇల్లుఅమ్మి అప్పు తీర్చమని చెప్పి కొడుకు వెళ్లిపోయాడు.

కళమ్మ ఇటీవల ఇల్లు అమ్మి మంగళవారం కుమార్తె, అల్లుడితో కలిసి ఇల్లు ఖాళీ చేస్తుండగా కొడుకు వచ్చి తనకు తెలియకుండా ఎలా అమ్మావని వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరిగి సతీశ్ ఆగ్రహంతో కర్రతో తల్లి తలపై కొట్టాడు. దీంతో ఆమె స్పృహతప్పి కిందపడిపోయింది. నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. నిందితుడు పరారీలో ఉన్నాడు.

మరో ఘటన కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తిలో చోటుచేసుకుంది. అల్లి సమ్మయ్య-సుగుణమ్మ(55)లకు నలుగురు కొడుకులు. మానసిక వికలాంగుడైన పెద్ద కొడుకు భాస్కర్ ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. మతిస్థిమితం సరిగాలేక కొన్నేళ్ల క్రితం అతని తండ్రిపై దాడి చేశాడు. దీంతో తండ్రి సమ్మయ్య భాస్కర్‌పై కేసు పెట్టగా రెండేండ్లు జైలు శిక్ష అనుభవించాడు.

అనంతరం ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అన్నం పెట్టాలని తల్లిని అడగ్గా ఆమె అన్నం పెట్టలేదు. దీంతో కోపోద్రిక్తుడైన భాస్కర్ పక్కనే ఉన్న రోకలిబండతో తల్లిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పై రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Two men allegedly killed their mothers in different incidents in Nalgonda and Karimnagar districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X