వివాహేతర సంబంధం: యువతిని గొడ్డలితో నరికి చంపాడు

విజయవాడ: నగరంలోని వన్ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళను దారుణంగా చంపాడు ఆమె భాగస్వామి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. పి. నైనవరంలో నివసించే కొప్పోజి వీరకుమారస్వామి(42)కి భార్య చంద్రావతి ఉండగానే.. షర్మిల అనే యువతితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిన్తున్నాడు.

కాగా, గత రెండు రోజులుగా కుమారస్వామికి, షర్మిలకు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం షర్మిలను గొడవలితో నరికి చంపాడు కుమారస్వామి. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యాడు.

A man allegedly killed his paramour

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మద్యం మత్తులో వ్యాయామ ఉపాధ్యాయుల అసభ్య ప్రవర్తన

మద్యం తాగిన వ్యాయామ ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ఏఎన్ యూ)లో చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా ఏపీలోని అన్ని జిల్లాల వ్యాయామ ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు ఇక్కడ జరుగుతున్నాయి.

కాగా, కొందరు వ్యాయామ ఉపాధ్యాయులు మద్యం తాగి వచ్చి మహిళా ఉపాధ్యాయురాలితో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో, అక్కడే ఉన్న మిగిలిన మహిళా ఉపాధ్యాయురాళ్లు పరుగులు తీశారు. ఈ ఘటనపై పై అధికారులకు వారు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+