ఏం జరిగిందో?: రిసెప్షన్ రోజే నవ వరుడు ఆత్మహత్య
విజయనగరం: ఎంతో ఆనందోత్సాహాల మధ్య సందడిగా వివాహం జరిగింది. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. పెళ్లైన రెండ్రోజులకే నవ వరుడు ఆత్మహత్మకు పాల్పడటంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే., విజయనగరం బాబామెట్ట ప్రాంతానికి చెందిన మదీనా అనే యువకుడుకి సాలూరుకు చెందిన ముబీనాతో సెప్టెంబర్ 2న వివాహం జరిగింది. పెళ్లి కుమార్తె ఇంట్లో పెళ్లి వేడుకలు జరగడంతో.. వరుడి స్వగృహంలో కూడా వేడుకల నిర్వహించేందుకు మంగళవారం సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

మరికొన్ని గంటల్లో జరగనున్న రిసెప్షన్ వేడుకకు పెళ్లి కుమార్తె బంధువులు, పెళ్లి కుమారుడి బంధుమిత్రులు ఒక్కోక్కరు చేరుకుంటున్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ., వరుడు తన గదిలో ప్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మచేసుకున్నాడు.
మృతుడు చీపురుపల్లి మండలం పెదనడిపల్లిలో వీఆర్వోగా పని చేస్తున్నాడు. నవ వరుడు మదీనా ఆత్మహత్యతో ఇరు కుటుంబాల్లో విషాదం ఛాయలు అలముకున్నాయి. మదీనా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications