ఆరేళ్ల బాలికపై రేప్: ఏడాది తర్వాత నిందితుడ్ని నరికి చంపారు
రంగారెడ్డి: జిల్లాలోని హయత్‌నగర్ మండలం బండ్లగూడలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గత సంవత్సరం ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి పారిపోయిన వ్యక్తి తిరిగి గ్రామానికి వచ్చాడు. దీంతో అతడ్ని పట్టుకున్న గ్రామస్తులు నరికి చంపారు.
స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

అగ్నిప్రమాదంలో దుకాణం దగ్ధం
నిజామాబాద్ జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం గోపాలపేటలో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షాక్‌తో ఓ దుకాణం పూర్తిగా కాలిపోయింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. భారీ ఆస్తి నష్టం సంభవించడంతో దుకాణ యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు రూ. 20 లక్షల ఆస్తి నష్టం జరిగింది.
పైపుల దుకాణంలో అగ్నిప్రమాదం
విశాఖపట్నంలోని పాతగాజువాక ప్రాంతంలోని ఓ పైపుల గోదాంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications