బియ్యపు గింజపై సచిన్, వివిధ భాషల్లోనూ (ఫోటో)
హైదరాబాద్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పైన అభిమానులు వివిధ పద్ధతుల్లో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సచిన్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.
సచిన్ టెండుల్కర్ సొంత మైదానమైన ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తన చివరి, 200వ టెస్టును వెస్టిండీస్‌తో ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అభిమానులు దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు.

హైదరాబాదుకు చెందిన పన్నాల మహేశ్వర్ అనే వ్యక్తి బియ్యపు గింజల పైన చిత్రాలు, పేర్లు రాస్తుంటారు. ఆయన సచిన్ చిత్రాన్ని బియ్యపు గింజ పైన గీసి, వివిధ భాషల్లో సచిన్ పేరును రాశారు.

హైదరాబాదుకు చెందిన ప్రముఖ కారు డిజైనర్ సుధాకర్ యాదవ్ భారీ బ్యాట్, బంతిని తయారు చేసి వాటిపై సచిన్ చిత్రాలతో గురువారం ప్రదర్శించారు. ఇక శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాళహస్తిలో సచిన్ వీడ్కోలు వేడుకలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications