ప్రియుడి కోసం భర్తను చంపి పొలంలో పాతిపెట్టింది
చిత్తూరు: జిల్లాలోని నాగులాపురం మండలం గోపాలపురంలో దారుణం ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి వ్యామోహంలో పడి కొడుకు, ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. హత్య చేసిన అనంతరం భర్త మృతదేహాన్ని పంట పొలంలోనే పాతిపెట్టింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కెవి పురానికి చెందిన మునెయ్యకు గోపాలపురానికి చెందిన సుమతితో 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 12ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా, గోపాలపురానికి చెందిన సెల్వం అనే వ్యక్తితో సుమతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో మునెయ్య.. సుమతితో తరచూ గొడవకు దిగేవాడు.

ఈ నేపథ్యంలో భర్తను ఎలాగైనా అంతమొందించాలని సుమతి నిర్ణయించింది. ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నింది. వారం క్రితం ప్రియుడు సెల్వం, కొడుకుతో కలిసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత అతని శవాన్ని సెల్వం పొలంలో పూడ్చిపెట్టారు. ఎవరూ గుర్తించకపోవడం పొలంలో నాట్లూ కూడా వేశారు.
ఇది ఇలా ఉండగా మునెయ్య తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ముందుగా మునెయ్య కుమారుడు బాబును ప్రశ్నించారు. పోలీసులకు అతడు అసలు విషయం చెప్పాడు.
అప్పులబాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య
అనంతపురం: అప్పుల బాధతో అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికుడు నవీన్ కుమార్ (21) శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చీరలకు గిట్టుబాటు ధర లబించకపోవటంతో అప్పులు పెరిగిపోయాయి. సుమారు రూ.5లక్షల వరకు అప్పున్నట్లు తెలిసింది. అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానాకి గురైన నవీన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications