Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సాయిరెడ్డి, రఘురామ లో గెలిచేదెవరు - వంశీ భారీ ట్విస్ట్..!!

ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఏపీలో ఫలితాల పై భిన్నమైన అంచనాలు ఇచ్చాయి. దీంతో..అసలు ఫలితం పైన మరింత ఆసక్తి పెరుగుతోంది. ఎన్నికల సరిళితో ఫలితాల పైన అంచనా లకు వచ్చిన పార్టీలు..ఎగ్జిట్ పోల్స్ తో పోల్చి చూస్తున్నాయి. ఇక...పలువురు ముఖ్య నేతల గెలుపు ఓటముల పైనా సర్వే సంస్థలు విశ్లేషించాయి. వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి...రెబల్ ఎంపీ రఘురామ గెలుపు పైన ఆసక్తకర అంశాలు తెర మీదకు వస్తున్నాయి.

ఏపీలో ఎగ్జిట్ పోల్స్ లో అనూహ్య అంచనాలు వెల్లడయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు పరిచయం ఉన్న సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఇవ్వగా...జాతీయ స్థాయి సంస్థలు టీడీపీ కూటమికి అధికారం దక్కుతుందని పేర్కొన్నాయి. ఇక..ఇదే సమయంలో ఏపీలో ఆరా సంస్థ ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో వివరిస్తూనే....ప్రముఖల గెలుపు, ఓటమలు మీద అంచనాలను వెల్లడించింది.

AARA Exit polls Reveals winning chances for Vijaya Sai Reddy and Raghu Rama Raju in the elections

ఆరా ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం వైసీపీకి 94 నుంచి 104 అసెంబ్లీ సీట్లు వస్తాయి. టీడీపీ కూటమికి 71 నుంచి 81 సీట్లు వస్తాయి. వైసీపీకి 49.41శాతం, కూటమికి 47.55 శాతం ఓటు శాతం వస్తుందని ఆరా పేర్కొంది. జగన్‌కు మహిళలు జై కొట్టారని, 56 శాతం మహిళలు ఫ్యాను గుర్తుకు ఓటేశారని ఆరా పేర్కొంది. కూటమికి 43 శాతం మహిళలు మద్దతిచ్చారని తెలిపింది.

ఇదే సంస్థ నెల్లూరులో ఎంపీగా పోటీ చేస్తున్న వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి పైన తన అంచనాలను బయట పెట్టింది. నెల్లూరులో విజయ సాయిరెడ్డి ఓటమి చెందే అవకాశం ఉందని అంచనా వేసింది. నెల్లూరులో టీడీపీ నుంచి మాజీ వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..విజయ సాయిరెడ్డి మధ్య హోరా హోరీ పోరు సాగింది.

పోలింగ్ ముందు, ఆ తరువాత టీడీపీ కూటమి నేతల తీరు పైన సాయిరెడ్డి పలు ఫిర్యాదు లు చేసారు. వైసీపీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న నెల్లూరులో సాయిరెడ్డి గెలుపు ఖాయమని పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేసారు. తాజాగా ఆరా సంస్థ అంచనాల పైన సాయిరెడ్డి తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. గెలుపు పైన సాయిరెడ్డి ధీమాగా ఉన్నారని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు.

ఇక, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఈ సారి టీడీపీ నుంచి ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. అక్కడ టీడీపీ రెబల్ శివరామ రాజు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసారు. టీడీపీ ఓట్లు గణనీయంగా చీల్చటంతో రఘురామ గెలుపు పైన ప్రభావం ఉంటుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. అయితే, ఆరా సంస్థ ఉండిలో రఘురామ కృష్ణరాజు గెలుపొందుతారని పేర్కొంది. అదే విధంగా అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గెలుస్తారని అంచనా వేసింది. అక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి బూడి ముత్యాల నాయుడు ఓడిపోతారని పేర్కొంది. గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ గెలుస్తారని ఆరా సంస్థ తమ అంచనాల్లో వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+