ఫొటోలు: ఫీజులపై రోడ్డెక్కిన ఎబివిపి విద్యార్థులు
హైదరాబాద్: ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో అధిక ఫీజులు అరికట్టి విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఎబివిపి) కార్యకర్తలు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద గురువారం ధర్నాకు దిగారు.

ఎబివిపి తలపెట్టిన ఈ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. గురువారం లక్డీకాపూల్‌లోని కమిషనర్ కార్యాలయానికి ర్యాలీగా వచ్చిన ఎబివిపి కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను ఈ ఏడాది నుంచే అమలు చేయాలని ఎబివిపి నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణలో కెజీ నుంచి పీజి వరకు ఉచిత విద్యను అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.













Click it and Unblock the Notifications