ఏసీబీ అధికారుల ర్యాలీ
అవినీతి నిరోధక శాఖ వారోత్సవాలను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు. బుధవారం గుంటూరు నగరంలో ఆశాఖ అధికారులు వారి శాఖపై అవగాహన కల్పించేందుకు వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహించారు.
గుంటూరు: అవినీతి నిరోధక శాఖ వారోత్సవాలను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు. బుధవారం గుంటూరు నగరంలో ఆశాఖ అధికారులు వారి శాఖపై అవగాహన కల్పించేందుకు వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహించారు. అవినీతిని నిర్మూలించండి.. అంటూ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాలు డిసెంబర్ 3 వ తేదీనుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో ప్రతిరోజు ఒక స్కూలు విద్యార్ధులు పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా..విద్యార్ధులు ప్రతి ఒక్కరికీ లంచo తీసుకోవడం నేరమనే విషయాన్ని తెలుపుతూ..ప్రజలలో ఆవగాహన తీసుకువస్తున్నారు.












Click it and Unblock the Notifications