టర్కీ రెస్టారెంట్ లో బాలయ్య - ఏం చేసారంటే : ఫ్యాన్స్ ఖుషీ..!!
నందమూరి బాలకృష్ణ. ఎక్కడ ఉన్నా సంథింగ్ స్పెషల్. ఇప్పుడు ఒక రెస్టారెంట్ లో సాదాసీదాగా ఒక కుటుంబంతో బాలయ్య సరాదాగా ముచ్చటించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. తన సింప్లిసిటితో వారితో మాట్లాడిన విధానం..సరదా మాటలతో బాలయ్య తన ప్రత్యేకత నిరూపించుకున్నారు. ఎన్బీకే 107 షూటింగ్ కోసం బాలయ్య టర్కీ వెళ్లారు. హీరోయిన్ శృతి హాసన్ తో కలిసి ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇస్తాంబుల్ లో షూటింగ్ లోకేషన్ నుంచి బాలయ్య, శృతిహాసన్ లతో గోపిచంద్ సెల్ఫీ ఫొటో తీసుకున్నారు.
సినీ హీరోగా 48 ఏళ్ల ప్రస్థానం
బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 48 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక, స్థానికంగా ఒక హోటల్ కు వెళ్లిన బాలయ్య అక్కడ ఉన్న కుటుంబంతో మాటలు కలిపారు. హిందీలో వారితో మాట్లాడుతూ సరదాగా కబుర్లు చెప్పారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. తన గురించి చెప్పుకొనే ప్రయత్నం చేసారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బాలయ్య అభిమానుల్లో వైరల్ అవుతోంది. అందులో బాలయ్య..ఆ కుటుంబంతో.. తాను టిఫిన్ చేసేశానని చెబుతూ.. మందులు వేసుకునే సమయమైందని చెప్పారు.

సరాదాగా అందరితో కలిసిపోయి..
తాను హిందూపురం ఎమ్మెల్యేగా.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రతీ క్షణం బిజీగా ఉండడం వలన ఆనందంగా ఉంటున్నానని వివరించారు. ఉంది. ఏం పని చేయకుండా ఖాళీగా కూర్చునేవాళ్లకి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తాయంటూ బాలయ్య చెప్పటంతో ఆ కుటుంబం కూడా హాయిగా నవ్వేసింది. అక్కడ ఉన్న ఒక మహిళను చూపిస్తూ.. వీళ్లు ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూస్తారని.. వాటితో మైండ్ పాడుచేసుకుంటారంటూ నవ్వతూ వ్యాఖ్యానించారు.

నవ్వుతూ..నవ్విస్తూ బాలయ్య ఇలా
టీవీ తక్కువ చూస్తే కళ్లకు మంచిది. అసలు చూడకపోతే మెదడుకి మంచిదంటూ సరాదాగా చెప్పటంతో..ఆ మహిళ సైతం నవ్వుతూ బాలయ్య ను అభినందించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, ఈ వీడియో చూసిన బాలయ్య అభిమానులు తమ అభిమాన హీరో సింప్లిసిటీని తెగ మెచ్చుకుంటున్నారు. అంతపెద్ద హీరో అయినా, ఎక్కడా గర్వ లేకుండా సాదా సీదాగా వ్యవహరిస్తున్న తీరును అభినందిస్తూ పోస్టింగ్ లు చేస్తున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications