చంపించారు, నీ గుట్టు.. నీ తాత గుట్టు విప్పుతా రా! నేనొక్కడినే వస్తా: జగన్‌పై ఆదినారాయణ

కడప: విజయసాయి రెడ్డి తనపై పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ఆదినారాయణ శుక్రవారం అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తాము సమన్వయంతో చేసుకుంటామని చెప్పారు. ఫ్యాక్షన్ పక్కన పెట్టి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారన్నారు.

చదవండి: ఊరపంది ఆలోచన, అందుకే మోడీకి నోటీసు: జగన్‌పై ఆదినారాయణ దారుణ వ్యాఖ్యలు, వీడియోపై..

వీడియోలు, తమపై ఆరోపణల, అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది వచ్చినా తాను ఒక్కడినే చర్చకు వస్తానని సవాల్ చేసారు. అధికారులను ప్రలోభ పెట్టి వారిని ముంచినట్లుగా మేం చేయమన్నారు.

చదవండి: ఎంతో పోరాడా, లాభం లేకపోయింది, అందుకే: మోడీపై బాబు సంచలన వ్యాఖ్యలు

నీ కుటుంబ చరిత్ర గుట్టు విప్పుతా రా!

నీ కుటుంబ చరిత్ర గుట్టు విప్పుతా రా!

నీ కుటుంబ చరిత్ర ఏమిటో, నా కుటుంబ చరిత్ర ఏమిటో తేల్చుకుందాం రా అని జగన్‌పై ఆదినారాయణ మండిపడ్డారు. మీ తాత రాజారెడ్డి గుట్టువిప్పుతానన్నారు. బైరటీస్ గనుల కోసం నర్సయ్యను రాజారెడ్డి హత్య చేయించారని సంచలన ఆరోపణ చేశారు. సీబీఐ, ఈడీ కేసులు పెట్టుకొని నన్ను విమర్శిస్తావా అన్నారు.

నన్ను ఆది ఏమీ అనలేదు

నన్ను ఆది ఏమీ అనలేదు

ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించినట్లుగా వచ్చిన వీడియోపై టీడీపీ నేత రామసుబ్బారెడ్డి కూడా స్పందించారు. ఎవరూ తనను వేలెత్తి చూపకుండానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదినారాయణ రెడ్డి తనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.

కొందరు కావాలనే తప్పుడు ప్రచారం

కొందరు కావాలనే తప్పుడు ప్రచారం

కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తమ ఇద్దరికీ (ఆదినారాయణ రెడ్డి) సమాన ప్రాధాన్యత, విలువ ఇస్తానని చంద్రబాబు చెప్పారని తెలిపారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.

అందుకే మారిషస్ నోటీసుల అంశం

అందుకే మారిషస్ నోటీసుల అంశం

ఇందూ టెక్ కేసులో మారిషస్ ప్రధాని మోడీకి నోటీసులు ఇచ్చిన అంశంపై వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ స్పందించారు. హోదాను పక్కన పెట్టేందుకే మారిషస్ కథలు అన్నారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ పైశాచిక ఆనందం పొందుతోందన్నారు.

జైలుకు పంపిస్తామన్న చంద్రబాబు ఏం చెబుతారు

జైలుకు పంపిస్తామన్న చంద్రబాబు ఏం చెబుతారు

ప్రత్యేక హోదా కోసం జగన్ ఉద్యమాలు, దీక్షలు, ధర్నాలు చేస్తే ప్రభుత్వమే పోలీసులతో కేసులు పెట్టించిందని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. హోదా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని చూశారని ఆరోపించారు.హోదా అంటే జైలుకు పంపిస్తామని బెదిరించిన చంద్రబాబు ఇప్పుడు ఏం చెబుతారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+