ఎంతో పోరాడా, లాభం లేకపోయింది, అందుకే: మోడీపై బాబు సంచలన వ్యాఖ్యలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంపై మరోసారి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన రోజు రోజుకు బీజేపీపై గొంతు పెంచుతున్నారు. తాజాగా శుక్రవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video

విభజన హామీల కోసం తాను ఎంతో పోరాడానని, లాభం లేకనే ఇక ఇప్పుడు గట్టిగా అడుగుతున్నానని వ్యాఖ్యానించారు. కష్టాలు ఉన్నాయని, కేంద్రం హామీలను అమలు చేసి సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదా-హామీలు మన హక్కు
ప్రత్యేక హోదా - విభజన హామీలు మన హక్కు అని చంద్రబాబు అన్నారు. వాటిని అమలు చేయడం కేంద్రం బాధ్యత అని చెప్పారు. మనం విభజన హామీల కోసం ఓ వైపు పోరాడుతూనే మరోవైపు కష్టపడి పని చేసి అభివృద్ధికి పాటుపడదామన్నారు.

వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు
విభజన హక్కుల సాధనలో తాను వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని చంద్రబాబు అన్నారు. ఈ నెల 27వ తేదీకి తాను రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు అవుతుందని చంద్రబాబు చెప్పారు. పలుమార్లు ఢిల్లీ వెళ్లి హామీలను నెరవేర్చాలని అడిగానని చెప్పారు.

మహా సంగమం ఏర్పాటు చేస్తాం
ఐదు నదులను అనుసంధానం చేసి మహా సంగమం ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీలో ఈ ప్రగతి అకాడమిని నెలకొల్పుతామని చెప్పారు. ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చి దిద్దుతామని చెప్పారు. ఏపీ ఈ ప్రగతి కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు.

మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే ప్రయత్నం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని మంత్రి అచ్చెన్నాయుడు వేరుగా అన్నారు. వైసీపీ నేతలు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అధికారులపై విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. అధికారులను బ్లాక్ మెయిల్ చేయడం జగన్ నైజం అన్నారు. జగన్ కారణంగా ఐఏఎశ్‌లు జైలుకు వెళ్లారన్నారు.

మేం పార్లమెంటులో పోరాడుతాం
కేంద్రం ఏపీకి న్యాయం చేయకుంటే పార్లమెంటులో తాము గట్టిగా నిలదీస్తామని ఎంపీ తోట నర్సింహం అన్నారు. ఎన్నికలకు ఏడాది లోపు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు రావనే వైసీపీ ఏప్రీల్ నెలలో రాజీనామా అంటోందని మండిపడ్డారు. తాము పార్లమెంటులో ఉండి పోరాడుతామని చెప్పారు.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్











Click it and Unblock the Notifications