షర్మిల స్థానంలో నూతన పీసీసీ చీఫ్ ఖరారు..!?
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం. కాంగ్రెస్ అధినాయకత్వం ఏపీ కేంద్రంగా కీలక మార్పుల కు సిద్దమైంది. ఎన్నో అంచనాలతో షర్మిలకు ఢిల్లీ నేతలు పార్టీ బాధ్యతలు కేటాయించారు. 2024 ఎన్నికల్లో షర్మిల పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నా ప్రయోజనం కలగలేదు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం పైన షర్మిల ఆశించిన స్థాయిలో పోరాటం చేయటం లేదనే అభిప్రాయం ఢిల్లీ నేతల్లో ఉంది. అదే సమయంలో షర్మిల పైన పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెళ్తున్నాయి. దీంతో.. షర్మిల స్థానంలో మరో మహిళా నేతకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
నూతన పీసీసీ చీఫ్
ఏపీ కాంగ్రెస్ కు కొత్త సారధి వస్తున్నారని పార్టీ నేతల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. 2024 జనవరిలో షర్మిలకు ఏరి కోరి పీసీసీ పగ్గాలు అప్పగించారు. తన అన్న జగన్ తో విభేదించి 2021 లో తెలంగాణలో పార్టీ స్థాపించిన షర్మిల.. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు. తొలుత రాజ్యసభ పదవి ఇవ్వాలని భావించినా.. ఏపీ బాధ్యతలు కేటాయించారు. ఆ ఎన్నికల్లో జగన్ లక్ష్యంగా షర్మిల ప్రచారం చేసారు. కడప నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కేంద్రంలో బీజేపీ కూటమి పైన కాంగ్రెస్ నాయకత్వం పోరాడుతుంటే.. రాష్ట్రంలో మాత్రం షర్మిల కూటమి కంటే.. తన అన్న పైన రాజకీయ పోరాటానికి ప్రాధాన్యత ఇస్తున్నారని పెద్ద ఎత్తున ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి.

షర్మిల స్థానంలో
జగన్ ను రాజకీయంగా 2024 ఎన్నికల్లో దెబ్బ తీయటానికి షర్మిల ప్రాధాన్యత ఇచ్చారు. పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తరువాత పార్టీ బలోపేతం కోసం ఏం చేయటం లేదని విజయవాడకు చెందిన నేతలు తాజాగా నేరుగా రాహుల్ గాంధీ కార్యాలయానికి ఫిర్యాదులు చేసారు. కాంగ్రెస్‌లో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నా, వారిని సమన్వయం చేయడంలో షర్మిల సఫలం కాలేకపోతున్నారనే విమర్శ ఉంది. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు... ఛాలెంజ్ లు మినహా పార్టీ కోసం షర్మిల ప్రణాళికా బద్దంగా.. నిర్మాణాత్మకంగా వ్యవహరించం లేదనే వాదన ఉంది. కూటమి ప్రభుత్వం పైన దూకుడుగా వెళ్లకపోవటం కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టాన్ని తెచ్చినట్టే అనే అభిప్రాయం బలంగా ఉంది. ముఖ్యంగా సీనియర్ నేతలు షర్మిల విధానాలపై అసంతృప్తిగా ఉన్నారని ఢిల్లీ నేతలు గుర్తించారు.
బీసీ మహిళకు ఛాన్స్
ఈ నేపథ్యంలో షర్మిల స్థానంలో ఉత్తరాంధ్రకు చెందిన బీసీ మహిళకు పీసీసీ పగ్గాలు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీ సైతం ఉత్తరాంధ్ర బీసీకే పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. పీసీసీ చీఫ్ గా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పేరు రేసులోకి వచ్చింది. ఢిల్లీ లో కొద్ది రోజుల క్రితం ఆమె రాహుల్, ఖర్గేను కలిసారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమె వైద్యరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారు. 2009లో ఎంపీగా గెలిచిన ఆమెకు కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రిపదవి లభించింది. 2019కి ముందు వైసీపీలో చేరినా అక్కడ పెద్దగా అవకాశం రాక, మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు పీసీసీ నూతన చీఫ్ గా అవకాశం దక్కనున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. షర్మిలకు పార్టీ జాతీయ కార్యదర్శి పదవి ఇస్తారని చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు పీసీసీ చీఫ్ విషయంలో కాంగ్రెస్ తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications