జగన్, బాలయ్య ఇలాకాల్లో ఎంఐఎం గురి - మారుతున్న లెక్కలు..!!
ఏపీలో స్థానిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ చోటు చేసుకున్న ఘర్షణలు.. వైసీపీ పిటీషన్ లు.. సుప్రీం ఆదేశాలతో ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల తేదీలను రీ షెడ్యూల్ పైన కసరత్తు కొనసాగుతోంది. కాగా.. మున్సిపల్ బరిలో ఎంఐఎం పోటీకి దిగటం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతోంది.
ఏపీలో ఎంఐఎం తమ పార్టీ విస్తరణకు సిద్దమైంది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఎంఐఎం తాజాగా బీహార్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. ఇప్పుడు ఏపీలో స్థానిక ఎన్నికల వేళ ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్లు ప్రకటించింది. మొత్తం 21 చోట్ల ఎంఐఎం పోటీకి దిగింది. కడప మేయర్ అభ్యర్థిని బరిలో నిలిపింది. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవికి MIM నామినేషన్ దాఖలు చేసింది. అదే విధంగా కడప మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ల వారీగా ఎంఐఎం తన అభ్యర్థులను రంగంలోకి దించింది. ఇక్కడ కూటమి- వైసీపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. కదిరి మున్సిపాలిటీలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎంఐఎం ఇక్కడ బరిలోకి దిగింది.

ఏపీలో విస్తరణ దిశగా ఎంఐఎం కార్యాచరణ
కడప, కదిరితో పాటుగా నందమూరి బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవికి కూడా ఎంఐఎం పోటీ పడుతోంది. ఇలా ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్న చోట పోటీ చేసి తన రాజకీయ బలాన్ని విస్తరించాలని ఎంఐఎం చూస్తోంది. ఎంఐఎం పోటీ చేసిన సీట్లు అన్నీ కూడా ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కావటంతో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్ానయి. ఎంఐఎం బరిలో ఉంటే ఓట్ల చీలిక ఖాయమని అంటున్నారు.వైసీపీ అధినేత సొంత జిల్లా కడప మేయర్ పీఠం పై ఎంఐఎం గురి పెట్టింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో ముస్లిం మైనారిటీల ఓట్లు ఉన్నాయి. దీంతో.. ఇప్పుడు ఎంఐఎం పోటీతో ఎవరి ఓట్లకు గండి పడుతుంది... ఎవరికి కలిసి వస్తుందనే రాజకీయ చర్చ ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications
