వైసీపీలోకి చేరికలు - పార్టీ నేతలకు జగన్ కీలక ఆదేశాలు..!!
స్థానిక ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ రోజు ఎన్నికల నిర్వహణ పైన తుది నిర్ణయం వెల్లడి కానుంది. అటు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసు కొంటున్నాయి. ఈ సమయంలోనే వైసీపీలో కూటమి నుంచి చేరికలు జరుగుతున్నాయి. పార్టీ కీలక నేతల భేటీలో జగన్ తాజా వ్యూహాల పై దిశా నిర్దేశం చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల పోరులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ రోజు సాయంత్రానికి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పైన పూర్తి స్పష్టత రానుంది. ఇక... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో వైసీపీ నేతలను ముందస్తు అరెస్ట్ లు చేసినట్లుగా ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలతో జగన్ కీలక భేటీ ఏర్పాటు చేసారు. సుప్రీం ఆదేశాలు.. ఎన్నికల సంఘం నిర్ణయాలు... వైసీపీ నేతల అరెస్టులు.. జెడ్పీటీసీ నామినేషన్లతో పాటుగా పార్టీలో కొత్తగా చేరికల పైనా చర్చించనున్నారు.

న్యాయ పోరాటానికి సిద్దం అవుతున్న వైసీపీ
జెడ్పీటీసీ.. ఎంపీటీసీ స్థానాలకు పార్టీ అభ్యర్ధుల నామినేషన్ల పైన జగన్ ఆరా తీసారు. పార్టీ నేతల అరెస్ట్ లకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. అదే విధంగా టీడీపీ కి రాజీనామా చేసిన శ్రీకాకుళం నేత గుండ లక్ష్మీదేవి తన మద్దతు దారులతో కలిసి వైసీపీలో చేరుతున్నారు. అదే విధంగా జగ్గంపేట లో జనసేన కోసం పని చేసిన మరో నేత సైతం వైసీపీలో చేరుతున్నట్లుగా సమాచారం. కాగా.. వీరితో కలిసి స్థానిక ఎన్నికల్లో పని చేయాలని పార్టీ నేతలకు జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల పైన ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా జగన్ స్పందించనున్నారు. ఇక.. జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల వ్యవహారం పైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. వారి స్పందనకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే ఆలోచనలో జగన్ ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం.













Click it and Unblock the Notifications
