'తమ్ముడు'కు శుభాకాంక్షలు- అంబటి..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఏపీలో అయిదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. అయిదు సీట్లు కూటమికే దక్కనున్నాయి. కూటమి అభ్యర్ధుల ఖరారు పైన కసరత్తు కొనసాగుతోంది. జనసేనకు ఒక సీటు ఖాయమైంది. మెగా బ్రదర్ నాగబాబు కు పవన్ ఎమ్మెల్సీ సీటు కేటాయించారు. రాష్ట్ర మంత్రివర్గంలోనూ నాగబాబును తీసుకుంటామని గతం లోనే చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు ఇదే అంశం పైన అంబటి రాంబాబు స్పందించారు. నాగబాబు - పవన్ ను ఉద్దేశించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్దుల కసరత్తు జరుగుతోంది. అయిదు స్థానాలు కూటమి కే దక్కనున్నాయి. వీటిలో జనసేనకు ఒక స్థానం ఖరారైంది. బీజేపీ నుంచి ఒక సీటు కోసం కొత్తగా ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, బీజేపీకి సీటు దక్కుతుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. మిగిలిన సీట్లు టీడీపీకి దక్కనున్నాయి. టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. ఎంపిక కసరత్తు లో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలు.. సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక కొనసాగుతోంది.

అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు!@NagaBabuOffl @PawanKalyan
— Ambati Rambabu (@AmbatiRambabu) March 6, 2025
ఎమ్మెల్సీగా నాగబాబు పేరు ఖరారు కావటం పైన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిం చారు. ఈ మేరకు ట్వీట్ చేసారు. అందులో... 'అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావ డంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు..' అని పేర్కొన్నారు. నాగబాబు ఎమ్మెల్సీ అయిన తరువాత వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉంది. నాగబాబుకు మంత్రిగా కేటాయించే శాఖల పైన చర్చ జరుగుతోంది. అందులో భాగంగా టూరిజం, సినిమాటో గ్రఫీ శాఖలు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ శాఖలు పర్యవేక్షిస్తున్న దుర్గేశ్ కు శాఖల మార్పు ఉంటుందని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు పవన్ - నాగబాబును ఉద్దేశించి అంబటి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications