'జగన్ జైలుకెళ్లొచ్చినా మారలేదు: టిక్కెట్‌కు కోట్లివ్వాలట'

హైదరాబాద్: పదహారు నెలల పాటు జైలుకు వెళ్లి వచ్చినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదని, ఆ పార్టీలో టిక్కెట్టుకు రూ.25 నుండి 30 కోట్లు అంటున్నారని, అందుకే ఆశావహులు గుండె పగిలి చనిపోతున్నారని కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన మండలి సభ్యులు కెఆర్ ఆమోస్ గురువారం మండిపడ్డారు.

సమైక్య నినాదాన్ని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గుండె పగిలేలా వినపించాలని చేస్తున్న వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. ఆమె గుండె ధైర్యం గల నాయకురాలని అందుకే తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. చేతనైతే సీమాంధ్రలో సీట్లు తెచ్చుకునే ప్రయత్నం చేయాలని సవాల్ చేశారు.

YS Jagan

ఇంకోసారి జైలుకెళ్లే దారి వెతకవద్దని హెచ్చరించారు. జగన్ చేష్టలకు ఆయన పార్టీలోని ఆశావహులే గుండె పగిలి చనిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఒక్కో సీటుకు కోట్లు అడుగుతున్నారని అంత చెల్లించుకోలేక కృష్ణా జిల్లాలో ఓ నేత గుండెపోటుతో చనిపోయారని, ఇంకెంత మంది చనిపోయినా జగన్ మాత్రం అధికారం, డబ్బు దండుకోవాలనే చూస్తున్నారని ధ్వజమెత్తారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బైబిల్ చేతిలో పట్టుకొని తిరుగుతారని, ఆమె కుమార్తె షర్మిల, తనయుడు జగన్ మాత్రం ఆ గ్రంథం చెబుతున్న దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారని విమర్శించారు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోమని చెప్పింది జగనే అన్నారు.

వచ్చే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామమంటూ చంద్రబాబు అంటున్నారని, పాండవులైన తెలంగాణ వారిపక్షాన కృష్ణపరమాత్మలా సోనియా గాంధీ ఉన్నారన్నారు. కురుక్షేత్రంలో పాండవులైన తెలంగాణవారే గెలుస్తారని, ఇలాంటి సొల్లు కబుర్లు చెబితే బాబుకు సీమాంధ్రలోనూ పుట్టగతులుండవన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+