పోలీస్ స్టేషన్‌లో నిందితుడి ఆత్యహత్యాయత్నం(పిక్చర్స్)
విశాఖపట్నం: ఓ కేసులో నిందితుడు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. కేసు విచారణ నిమిత్తం మురళి అనే నిందితుడ్ని పోలీసులు విశాఖపట్నం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కాగా, తనను అకారణంగా వేధిస్తున్నారంటూ కిటికీ అద్ధం ముక్కతో పొట్టలో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పాడ్డాడు మురళి. దీంతో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి.
పోలీసులు వెంటనే అతన్ని కెజిహెచ్ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కైలాసపురానికి చెందిన బత్తిన మురళి (28) మరో ఏడుగురు కలిసి ఏప్రిల్ 14న రుషికొండ సమీపంలో మద్యం సేవించి రేసపువానిపాలెంలోని పెట్రోల్ బంక్‌కు అర్ధరాత్రి వెళ్లారు. పెట్రోల్ పోసేందుకు బంకు సిబ్బంది నిరాకరించడంతో వీరు ఘర్షణకు దిగారు. దీంతో బంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మురళితోపాటు 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అప్పట్నుంచి నిందితులను సిఐ మోహన్ రావు విచారిస్తున్నారు. సిఐ తమను లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారని, అవి ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో తనను వేధించడం ప్రారంభించారని మురళి ఆరోపించాడు. కాగా, మురళి రెండు హత్య కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. మురళిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు, మిగిలిన నిందితులను కోర్టుకు తరలించినట్లు ట్రీటౌన్ సిఐ అప్పలరాజు తెలిపారు.

నిందితుడికి వైద్యం
తనను అకారణంగా వేధిస్తున్నారంటూ కిటికీ అద్ధం ముక్కతో పొట్టలో పొడుచుకుని త్మహత్యాయత్నానికి పాల్పాడ్డాడు మురళి. దీంతో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే అతన్ని కెజిహెచ్ ఆస్పత్రికి తరలించారు.

నిందితుడి బంధువులు
బత్తిన మురళి (28) మరో ఏడుగురు కలిసి ఏప్రిల్ 14న రుషికొండ సమీపంలో మద్యం సేవించి రేసపువానిపాలెంలోని పెట్రోల్ బంక్‌కు అర్ధరాత్రి వెళ్లారు. పెట్రోల్ పోసేందుకు బంకు సిబ్బంది నిరాకరించడంతో వీరు ఘర్షణకు దిగారు. దీంతో బంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మురళితోపాటు 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

స్టేషన్‌లో రక్తపు మరకలు
అరెస్ట్ చేసిన నాటి నుంచి నిందితులను సిఐ మోహన్ రావు విచారిస్తున్నారు. సిఐ తమను లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారని, అవి ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో తనను వేధించడం ప్రారంభించారని మురళి ఆరోపించాడు.

నిందితుడి బంధువల ఆందోళన
పోలీస్ స్టేసన్‌లో ఉన్న నిందితుడు మురళి కత్తి పొడుచుకుని ఆస్పత్రిలో చేరడంతో అతని బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.












Click it and Unblock the Notifications