AP Election 2024: పింఛన్ కోసం వచ్చి వడదెబ్బతో వృద్ధురాలు మృతి..
రాష్ట్రంలో పింఛన్ల లొల్లి కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల పింఛన్లపై రాజకీయంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా పింఛన్ కోసం వచ్చిన ఓ వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందింది. ఏపీలో ఇప్పటి వరకు పింఛన్లను వాలంటీర్లే ఇంటికి వచ్చి అందించే వారు. అయితే ఎన్నికల కమిషన్ ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేయకూడదని ఆదేశించింది. దీంతో వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేయాలేదు.
దీంతో ప్రభుత్వం సచివాలయంలో పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించింది. బుధవారం ఉదయం నుంచి వేల మంది లబ్ధిదారులు పింఛన్ల కోసం సచివాలయానికి తరలొచ్చారు. అయితే కొన్ని అధికారులు సకాలంలో రాలేదు. దీంతో లబ్ధిదారులు ఎండలోనే పింఛన్ కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కృష్ణ జిల్లా గంగూలురులో పింఛన్ కోసం సచివాలయానికి వచ్చిన 80 ఏళ్ల వజ్రమ్మ వడదెబ్బతో స్పృహా కోల్పోయారు. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయింది.

వజ్రమ్మ మరణానికి టీడీపీ కారణమంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలని, వారు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేస్తున్న క్రమంలో ఆ పార్టీకి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ, జనసేన ఎప్పటి నుంచో విమర్శిస్తున్నాయి. వాలంటీర్లు వైసీపీకి ప్రచారం చేస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన ఈసీ వాలంటీర్ల నుంచి మొబైళ్లు వెనక్కు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
అదే సమయంలో వాలంటీర్లతో పింఛన్ల పంపిణీ చేయించ వద్దని ఓ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఎన్నికల సంఘానికి కూడా కంప్లెంట్ చేసింది దీంతో ఈసీ వాలంటీర్లు పింఛన్లు పంపిణి చెయ్యొద్దని స్పష్టం చేసింది. దీంతో టీడీపీ వల్లే పింఛన్ల పంపిణీ ఆగిపోయిందని వైసీపీ ఆరోపించింది. పింఛన్ల పంపిణీపై సోషల్ మీడియాలో డీటీడీ, జనసేన, వైసీపీ ఎదురుదాడికి దిగుతున్నాయి.












Click it and Unblock the Notifications