జేసీ ప్రఖాకర్‌రెడ్డికి ఊరట.. కరోనా నేపథ్యంలో షరతులతో బెయిల్ ఇచ్చిన అనంతపురం కోర్టు...
అనంతపురం: పోలీసు అధికారులను దూషించిన కేసులో అరెస్ట్ అయి ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కొంటున్న టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి అనంతపురం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
జైల్లో ఉండగా జేసీ ప్రభాకర్‌రెడ్డికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రభాకర్‌రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. దీంతో ఆయనకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో షతులతో కూడిన బెయిల్‌ను అనంతపురం కోర్టు మంజూరు చేసింది.

అనంతపురం జిల్లాలో వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు 55 రోజుల పాటు కడప జైల్లో ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదలై ఇంటికొస్తుండగా కోవిడ్ నిబంధనల మేరకు వాహనాల అనుమతికి స్ధానిక పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు.
పోలీస్ అధికారి ఫిర్యాదుతో ఆయనపై మళ్లీ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి కడప జైలుకు తరలించారు. జైల్లో ఉండగా కరోనా వైరస్ సోకింది. బెయిల్ లభించడంతో ఆయన్ను ఎక్కడికి తరలిస్తారో చూడాల్సి ఉంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications