ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం- కీలక బిల్లులు

అమరావతి: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం కుదిరింది. వచ్చే నెల మూడోవారంలో అసెంబ్లీని సమావేశ పర్చాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. 18 లేదా 20వ తేదీల్లో అసెంబ్లీ భేటీ అవ్వొచ్చని సమాచారం. ఈ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించేలా అధికార పార్టీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

దీన్ని పొడిగించడమా? లేక కుదించడమా? అనేది ప్రభుత్వం బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో ఖరారవుతుంది. అంతకంటే ముందు- ఏపీ మంత్రివర్గం సమావేశమౌతుంది. 15వ తేదీన వెలగపూడి సచివాలయంలో ఈ సమావేశం ఏర్పాటవుతుందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి అధ్యక్షత వహిస్తారు. వర్షాకాల సమావేశాలను ఎప్పుడు చేపట్టాలనేది ఈ భేటీలో ఖారారవుతుంది.

Andhra Assembly monsoon session likely to commence from September 18th or 20

దీనితోపాటు- సభలో ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన బిల్లులపై ఇందులో చర్చిస్తారు. ప్రత్యేకించి- మూడు రాజధానుల బిల్లు విషయంలో ఇక జాప్యం చెయ్యకూడదని, ఈ భేటీలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇదివరకు మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.

మరింత మెరుగైన బిల్లుతో వస్తామంటూ వైఎస్ జగన్ అప్పట్లోనే తేల్చి చెప్పారు. ఆ తరువాత ఇప్పటివరకు అది చర్చకు రాలేదు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లల్లో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం..విశాఖపట్నానికి తరలి వెళ్లొచ్చనే ప్రచారం ఊపందుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ అసెంబ్లీలో దీనికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు లేకపోలేదు.

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఇదివరకు ఆ పార్టీ శాసనసభ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ఈ బహిష్కరణను ఇప్పుడు కూడా కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+