ఏపీ అసెంబ్లీ రద్దు కాబోతుందంటూ బాంబు పేల్చిన ఆర్జీవీ

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతోన్నారనే వార్తలు కొద్దిరోజులుగా రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. డిసెంబర్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చనే అంచనాలు రోజూ వెలువడుతూనే ఉన్నాయి. ఈ వార్తలు, అంచనాలపై అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తోసిపుచ్చట్లేదు.

అటు వైఎస్ జగన్ కూడా పార్టీ క్యాడర్ ను ఎన్నికల దిశగా సన్నద్ధం చేస్తోన్నారని చెబుతున్నారు. ఎల్లుండి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలతో సమావేశం కానున్నారు. ఈ భేటీ కూడా ఈ సన్నాహకాల్లో భాగమేనని, అందుకే ఆయన హుటాహుటిన ఈ భేటీని నిర్వహిస్తోన్నారనే అంచనాలు ఉన్నాయి. ముందస్తు ఎన్నికలపై వైఎస్ జగన్ ఈ సమావేశంలో సంకేతాలను ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు.

Andhra assembly will be dissolved in June 1st week, predicts Ram Gopal Varma

ఈ పరిణామాల మధ్య ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాంబు పేల్చారు. త్వరలో ఏపీ అసెంబ్లీ రద్దు కాబోతోందని ప్రకటించారు. వైఎస్ జగన్‌ను తాను అభిమానిస్తానంటూ ఇదివరకు ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొన్నారు వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడిగా ఆయనకు కొంత గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి- ఏపీ అసెంబ్లీ రద్దు కాబోతోందని చెప్పడం కలకలం రేపింది. రాజకీయంగా దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.

ఏపీ అసెంబ్లీ రద్దవుతుందంటూ దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని రామ్ గోపాల్ వర్మ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం నుంచి తనకు అందిన సమాచారం మేరకే ఈ విషయాన్ని పంచుకుంటోన్నానని చెప్పారు ఆర్జీవీ. జూన్ మొదటివారంలో ఏపీ అసెంబ్లీ రద్దవుతుందనే తేల్చి చెప్పారు. డిసెంబర్ లో ఎన్నికల ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీలో తనకు ఉన్న సోర్స్ నుంచి ఈ సమాచారం బయటికి వచ్చిందని పేర్కొన్నారు.

దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తోన్నారు. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ అభిమానులు భిన్నాభిప్రాయాలను తెలియజేస్తోన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు భయపడి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తోన్నారంటూ టీడీపీ సానుభూతిపరులు కామెంట్స్ పెడుతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం జగన్ కు రాకపోవచ్చనే వాదనలు కూడా ఉన్నాయి. ఇవ్వాళ ఏప్రిల్ 1 కావడం వల్ల అందరినీ ఏప్రిల్ ఫూల్ చేయడానికే రామ్ గోపాల్ వర్మ ఈ ట్వీట్ చేశారని మరికొందరు అభిప్రాయపడుతోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+