చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారా ?, టీటీడీ అధికారుల నిర్లక్షంతో సీఎం సీరియస్, కథ క్లోజ్ !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు మొదట తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని తరువాత సీఎంగా బాధ్యతలు స్వీకరించాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు తిరుపతిలోని టీడీపీ నాయకులను కలిశారు. తరువాత అక్కడి నుంచి తిరుమల చేరుకున్నారు.

సీఎం హోదాలో తిరుమల చేరుకున్న చంద్రబాబు అక్కడి గాయిత్రీ నిలయం దగ్గరకు వెళ్లారు. చంద్రబాబును టీడీపీ నాయకులు, తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు దేవాదాయ శాఖ అధికారులు కారు దగ్గరకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు టీటీడీ అధికారులు ఎవ్వరూ గాయిత్రీ నిలయం దగ్గరకు వెళ్లిన చంద్రబాబుకు స్వాగతం పలకడానికి కారు దగ్గరకు వెళ్లలేదు.

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu treated carelessly by TTD officials

కారు దిగిన చంద్రబాబు నేరుగా గాయిత్రీ నిలయం లోపలికి వెళ్లారు. గాయిత్రీ నిలయం విశ్రాంతి భవనం లోపల టీటీడీ జేఈవో, టీటీడీ ఇన్ చార్జ్ ఈవో వీరబ్రహ్మం సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే టీటీడీ అధికారుల తీరుతో అసహనంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు జేఈవో వీరబ్రహ్మం నుంచి బోకే తీసుకోవడానికి నిరాకరించి విశ్రాంతి భవనంలోపలికి వెళ్లిపోయారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత చంద్రబాబు మొదట తిరుమలకు వస్తారని ముందుగానే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే టీటీడీ అధికారులు తీరును అందరూ ఖండిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారని టీటీడీలోని ఉన్నతాధికారులు అనుకున్నారా ? అని అదే టీటీడీలోని కొందరు అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు., లేక ఇంతకాలం వైసీపీ సేవలో తరించిన అధికారులు ఆ మూడ్ నుంచి ఇంకా బయటకు రాలేదా అని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu treated carelessly by TTD officials

తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని విజయవాడ వెళ్లిన తరువాత టీటీడీలోని ఉన్నతాధికారుల కథ చూడాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్నారని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు అంటున్నారు. తిరుమలలో సీఎం చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కారికాలవలన్, అనంతపురం రేంజ్ డీఐజీ శ్రీమతి సిమోషి, తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు, టీటీడీ జేఈవో శ్రీమతి గౌతమి కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+