ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాక, హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా, ఇటీవల వెంకట్రామిరెడ్డి కడప జిల్లా బద్వేలులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై వైసీపీకి ఓటు వేయాలని ప్రచారం చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Andhra Pradesh secretariat employees union president venkatrami reddy suspended

ఈ క్రమంలో ఈ వ్యవహారంపై కడప జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. వెంకట్రామిరెడ్డి పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

వైసీపీపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు

వైసీపీ నేతలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో జరిగిన వివిధ అవకతవకల పై సీఈఓ కు ఫిర్యాదు చేశామని టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య తెలిపారు. వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి, వారి టీమ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నీ ఇష్టానుసారం అతిక్రమిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీలు బరితెగించి ప్రవర్తించకూడదన్నారు. పోలీసులు కూడా బరితెగించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

సత్తెనపల్లిలో మహిళలను అత్యంత గౌరవంగా చూసే మంత్రి అంబటి రాంబాబు.. టీ కప్‌లపై రాంబాబు, ఎంపీ అభ్యర్థి అనిల్ యాదవ్ ఫోటోలు ముద్రించి, సత్తెనపల్లి లోని అన్ని టీ స్టాల్స్ కి ఇచ్చి, అందులోనే టీ పోసి అమ్మాలని చెబుతున్నారని సీఈఓకు ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత మహానాయకుల ఫొటోలకే ముసుగు వేస్తే మీ ఫోటోలు వేసుకుంటారా? అని నిలదీశారు. టీడీపీ సానుభూతిడైన ఒక టీ షాప్ వ్యక్తి టీ కప్పులు తీసుకోనూ అంటే.. మా పోలీసులను పంపిస్తానని అంటారా? అని వర్ల రామయ్య మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+