ఏపీని మరోసారి హెచ్చరించిన వాతావరణశాఖ
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగు రోజుల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. 19వ తేదీ వరకు వానలు కురవనున్నాయని వెల్లడించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిలాల్లో స్వల్ప వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈనెల 18వ తేదీకి వాయువ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ఆరోజు నుంచి రాష్ట్రంలో వర్షాలు ఊపందుకుంటాయని చెప్పింది.

17వ తేదీన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో, 18వ తేదీన కూడా ఈ జిల్లాల్లోనే వర్షాలు కురవనున్నాయి. 19వ తేదీన కాకినాడ, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.కాకినాడలో 6.8 మిల్లీమీటర్లు, తునిలో 0.8 మిల్లీమీటర్లు, గన్నవరంలో 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాపట్లలో గరిష్టంగా 36.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.












Click it and Unblock the Notifications