డ్రామాలు ఆడుతారా, మీ నాటకాలకు తెరదించుతాం: టీడీపీపై మరో బీజేపీ నేత
అమరావతి: తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేతల విమర్శల దాడి పెంచుతున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు అధికార టీడీపీపై విమర్శలు గుప్పించారు. దీంతో టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Recommended Video

దీంతో సోము వీర్రాజు మంగళవారం టిడిపిపై భగ్గుమన్న విషయం తెలిసిందే. గతమంతా తవ్వి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా బుధవారం బీజేపీ నేత సురేష్ రెడ్డి టీడీపీపై మండిపడ్డారు.

టీడీపీ డ్రామాలు ఆడుతోంది
తెలుగుదేశం పార్టీ డ్రామాలు ఆడుతోందని సురేష్ రెడ్డి నిప్పులు చెరిగారు. మిత్రధర్మానికి ఆ పార్టీ తూట్లు పొడుస్తోందన్నారు. తమపై విమర్శలు సరికాదన్నారు. మిత్రపక్షాలకు వెన్నుపోటు పొడిచే చరిత్ర తెలుగుదేశం పార్టీది అన్నారు.

చిన్నచూపు చూస్తోంది
బీజేపీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. జన్మభూమి కమిటీలలో కూడా బీజేపీ కార్యకర్తలకు స్థానం కల్పించడం లేదని సురేష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పథకాలు, రుణాలు, అన్నీ టిడిపి కార్యకర్తలకే వెళ్తున్నాయని చెప్పారు.

అవినీతిని ప్రశ్నిస్తే తప్పుపడతారా
అవినీతిపై ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని సురేష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం లేదన్నారు. చంద్రబాబు అవినీతిని ప్రశ్నించినందుకు బీజేపీ నేతలపై ఆగ్రహం సరికాదన్నారు.

పార్టీ నాటకాలకు తెరదించుతాం
తాము తెలుగుదేశం పార్టీ నాటకాలకు తెరదించేందుకు సమాయత్తమయ్యామని సురేష్ రెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టు విషయమై బీజేపీ నేతలు ఉపరాష్ట్రపతి వెంకయ్య సమక్షంలో ఢిల్లీలో చర్చలు జరిపారు. నితిన్ గడ్కరీ, ఎంపీ హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్, విశాఖ, రాజమండ్రి ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications