కలిశారుగా, ఇస్తారులే: మహిళల పట్ల మంత్రి రావెల కిషోర్ దురుసు!
ఇళ్ల పట్టాల కోసం మంత్రి వద్దకు వచ్చిన పత్తిపాటి మండలం కోయవారిపాలెం ఎస్టీ మహిళ పట్ల రావెల దురుసుగా ప్రవర్తించారని బాధితులు ఆరోపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
విజయవాడ: మంత్రి రావెల కిషోర్ బాబు తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఇళ్ల పట్టాల కోసం మంత్రి వద్దకు వచ్చిన పత్తిపాటి మండలం కోయవారిపాలెం ఎస్టీ మహిళ పట్ల రావెల దురుసుగా ప్రవర్తించారని బాధితులు ఆరోపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఆయన తీరు పైన బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల పట్టాల కోసం వెళ్తే ఆయన దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారుగా, ఆయన ఇస్తారులే అని ఇంటి నుంచి నెట్టి వేయించారని బాధితులు ఆరోపించారని సమాచారం. రావెల తీరును నిరసిస్తూ రేపు బాధితులు దీక్ష చేయనున్నారు.
మంత్రి రావెల తీరు పైన గతంలోను వివాదాలు వచ్చాయి. హైదరాబాదులో ఆయన తనయుడు ఓ అమ్మాయిని కారులో వెంబడించినట్లుగా వార్తలు వచ్చాయి. ఒకరిద్దరు మంత్రుల పైన ఒకటికి రెండుసార్లు వివాదాలు చుట్టుముట్టాయి.












Click it and Unblock the Notifications