ప్లాన్ ప్రకారం.. బొత్స హవా, జగన్‌కు మరో షాక్: కోలగట్ల అలక, టిడిపిలో చేరేనా?

వైసీపీ ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి పార్టీ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

విజయనగరం: 2014లో వైసిపి నుంచి పోటీ చేసి రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన. త్వరలో మరింతమంది ఎమ్మెల్యేలు, నేతలు తమ పార్టీలోకి వస్తారని టిడిపి నేతలు చెబుతున్నారు.

విజయనగరం జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఒకరు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

విజయనగరం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టిందని అంటున్నారు. బొత్స సత్యనారాయణ చేరినప్పటి నుంచి లోలోన రగులుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయని అంటున్నారు.

Another shock to YS Jagan: Kolagatla may join TDP?

వైసీపీ ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి పార్టీ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. టిడిపిలో చేరేందుకు సన్నాహాలు కూడటా చేసుకుంటున్నారని ప్రచారం కూడా సాగుతోంది.

పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఈ నెల 19న యువభేరిలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చినప్పుడు పథకం ప్రకారం కోలగట్ల ప్రాధాన్యాన్ని దెబ్బతీసేవిధంగా బొత్స సత్యనారాయణ వర్గం వ్యవహరించిందని అంటున్నారు. దీంతో కలత చెందిన కోలగట్ల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కోలగట్ల గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నుంచి వైసిపిలో చేరారు. ఆ తర్వాత బొత్స సత్యనారాయణ వైసిపిలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచే ఇరువర్గాల మధ్య వైరం ఉంది. వైసిపిలోను కొనసాగుతోంది.య

వైసీపీ చేపట్టే కార్యక్రమాలను ఇరువర్గాలు విడివిడిగా చేపడటుతున్నాయి. ఇటీవల జగన్‌ పర్యటన సమయంలో బొత్స వర్గం పెత్తనం చెలాయించడంతో ఆవేదన చెందిన కోలగట్ల రాజీనామాకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+