వైసిపి ఎమ్మెల్యేల ఆందోళన: ఎపి అసెంబ్లీ వాయిదా

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మంగళవారం ఉదయం వాయిదాతో ప్రారంభమైంది. సభ మొదలైన వెంటనే అంగన్‌ వాడీ కార్యకర్తల సమస్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ తిరస్కరించారు. దీంతో వాయిదీ తీర్మానంపై చర్చ జరపాలంటూ వైయస్సార్ కాంగ్రెసు సభ్యులు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెకొంది.

స్పీకర్‌ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ సభ్యులు వెనక్కి దగ్గకపోవడంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. నోటీసు ఇస్తే అజెండాలో చేరుస్తానని స్పీకర్ చెప్పిన ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు వినిపించుకోలేదు.

AP assembly adjourned on Anganawadi workers issue

సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సభను మరోసారి పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎపి శాసనసభ ముట్టడికి బయలుదేరిన అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాదులో పలు చోట్ల అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+