మేకపాటి గౌతమ్ రెడ్డికి అసెంబ్లీ నివాళి: వైఎస్ జగన్‌కు నిఖార్సయిన సైనికుడు: రోజా సహా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజు సభ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమైంది. ఇటీవలే గుండెపోటుతో కన్నుమూసిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై సభ సంతాపం తెలిపింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, శాసన సభ్యులు మాట్లాడారు. గౌతమ్ రెడ్డితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మనస్తత్వం..
ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డి రాజకీయల్లో ఉన్నత పదవులు సాధించినా ఒదిగి ఉండేవారని అన్నారు. మరో మూడు దశాబ్దాల పాటు ఆయన ప్రజా జీవితంలో ఉంటారని తాను భావించానని చెప్పారు. ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం గౌతమ్ రెడ్డి కృషి చేశారని, పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకుని రావడానికి అవిరళ కృషి చేశారని చెప్పారు.

పెట్టుబడుల కోసం..
ఏపీ పారిశ్రామిక, ఐటీ విధానాలకు రూపకల్పన చేయడంలో గౌతమ్ రెడ్డి చూపిన చొరవ చిరస్మరణీయమని అన్నారు. పారిశ్రామిక వేత్త కావడం వల్ల ఆ అనుభంతో పారిశ్రామిక విధానాలను రూపొందించారని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం తపించే నాయకుడని విద్యాశాఖ ఆదిమూలపు సురేష్ గుర్తు చేశారు. కడప జిల్లా ఇన్‌చార్జ్‌గా తాను కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాను అభివృద్ధి చేయడానికి గౌతమ్ రెడ్డి పట్టుదల, కమిట్‌మెంట్‌ను తాను దగ్గరి నుంచి చూశామని పేర్కొన్నారు.

మచ్చ లేని నాయకుడు..
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠ్మారణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నెల్లూరు జిల్లాకే చెందిన జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డి వివాద రహితుడని, ఆయన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదని అన్నారు. ఎలాంటి ఇగో లేని నాయకుడని, చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరితోనూ చనువుగా ఉంటారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు.

బంగారం లాంటి మనిషి..
గౌతమ్ రెడ్డి ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు. 2010 నుంచి సన్నిహితంగా మెలిగామని, రాజకీయ కోణంలోనే కాకుండా తనకు వ్యక్తిగతంగా ఆయనతో ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. బంగారం లాంటి మనిషిని రాష్ట్రం కోల్పోయిందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి అన్నారు. ఆయన లేరనే విషయాన్ని ఊహించుకోలేకపోతున్నామని చెప్పారు. కొత్తగా మంత్రివర్గం చేరినా.. ఎంతో అనుభవం ఉన్న నాయకుడిలా తన శాఖను సమర్థవంతంగా నడిపించారని అన్నారు.
Recommended Video

అజాతశతృవు
గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి రావడం దురదృష్టకరమని ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రజల మెప్పు మాత్రమే కాదు.. తోటి రాజకీయ నేతలు కూడా మెచ్చుకునేలా వ్యవహరించారని, మచ్చలేని రాజకీయ జీవితం ఆయనదని చెప్పారు. గౌతమ్ రెడ్డి ఓ అజాతశతృవు అని అన్నారు. వైఎస్ జగన్‌కు నిజమైన సైనికుడు గౌతమ్‌రెడ్డేనని వ్యాఖ్యానించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్ ఈ తీర్మానంపై మాట్లాడారు. ఆయనతో తమకు అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!












Click it and Unblock the Notifications