అకాల వర్షాలతో అన్నదాతకు కన్నీరు: పంట నష్టం ఎంతంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలు వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ప్రకృతి ప్రకోపానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,215 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బతినగా, ఉద్యాన వనాలకు సైతం భారీ నష్టం వాటిల్లింది. ఈ విపత్కర పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
క్షేత్రస్థాయి నుంచి అందిన ప్రాథమిక నివేదికలను పరిశీలించిన ముఖ్యమంత్రి, గాలివానల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎక్కడా రాజకీయాలకు తావులేకుండా పారదర్శకమైన అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

అధికారులు సమర్పించిన ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలోని ఆరు జిల్లాలపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 16 మండలాల పరిధిలో గల 89 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 384 హెక్టార్లలో వరి, 630 హెక్టార్లలో మొక్కజొన్న, 200 హెక్టార్లలో మినుము పంటలు నీట మునిగా.. పలు చోట్ల గాలివానల ధాటికి నేలవాలాయి.
రైతులకు తీవ్ర నష్టం..
దీనివల్ల సుమారు 2,043 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాధారణ పంటలతో పాటు వాణిజ్యపరంగా కీలకమైన ఉద్యాన పంటలైన అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ తోటలు సైతం వడగళ్ల వానకు దెబ్బతిన్నాయి. అనంతపురం, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లోని 267 హెక్టార్లలో ఈ నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతం
సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేవలం ప్రాథమిక అంచనాలకే పరిమితం కాకుండా, ప్రతి గ్రామంలో ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తిస్థాయి నష్టాన్ని లెక్కించాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు రైతులకు చేరువ చేస్తూ, వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అప్రమత్తం చేయాలన్నారు. తద్వారా రాబోయే రోజుల్లో పంట నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications