కూటమి నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భూ బాధితుల కోసం తానే స్వయంగా రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. భూ బాధితులకు సంబంధించిన ఫిర్యాదులను తానే స్వయంగా పరిశీలిస్తానని అన్నారు. అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఈమేరకు పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భూదందాల బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తామని అంతేకాదు ఫిర్యాదులను తానే స్వయంగా పరిశీలిస్తానని పవన్ ఈ మీటింగ్ లో చెప్పారు. కూటమి పాలన పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగుతోందని అన్నారు. ప్రజలను ఇబ్బందిపెడితే కూటమి నేతలనూ ఉపేక్షించనని పవన్ కల్యాణ్ ఈమేరకు హెచ్చరించారు. భూ బాధితులకు జరిగిన అన్యాయాలపై స్వయంగా తానే రంగంలోకి దిగుతున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇక నుంచి భూ సమస్యలపై స్వయంగా తానే జిల్లాలకు వెళ్లి అర్జీలు స్వీకరించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు. అలాగే కబ్జాలకు పాల్పడిన ఎవరినైనా సరే శిక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా అధికారులతో జరిగిన టెలీ కాన్ఫరెన్స్ లో పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అయితే ఇటీవల కాలంలో భూ కబ్జాలకు సంబంధించిన సమస్యలు రాష్ట్రం నలుమూలుల నుంచి వస్తున్నాయి. దీంతో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

పవన్ దాతృత్వం..
ఇటీవల ఉగాది పర్వదినం సందర్భంగా పిఠాపురంలో 10వేల మంది మహిళలకు పవన్ కల్యాణ్ చీరలను పంపిణీ చేశారు. తనను ఆదరించి గెలిపించినందుకు ప్రతి కుటుంబానికి తాను పసుపు కుంకుమ కింద వీటిని పంపిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తాను స్వయంగా ఆయన వెళ్లకపోయినా.. పార్టీ నాయకులతో పంపిణీ చేశారు.
అదే విధంగా తన సొంత డబ్బులతో 345 మంది గిరిజనులకు పవన్ నాణ్యమైన పాదరక్షలు పంపిణీ చేశారు. ఇటీవల మన్యం జిల్లా పర్యటనలో భాగంగా కురిడి, పెదపాడు గ్రామాల్లో పర్యటించిన ఆయన.. అక్కడి ప్రజలకు కనీసం చెప్పులు లేవని గ్రహించారు. దీంతో పవన్ వారికి చెప్పులు కొని అధికారుల ద్వారా పంపిణీ చేశారు. దీంతో ఆ గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications