రైతులకు శుభవార్త: రూ.లక్షన్నరకు పెంచిన చంద్రబాబు ప్రభుత్వం

ఏపీలో ఇటీవల బుడమేరు పొంగడంతో సగం విజయవాడ నగరం మునిగిపోయింది. ఆ సమయంలో ప్రజల ఇళల్లోని వస్తువులన్నీ దెబ్బతినడంతోపాటు జీనవోపాధిని కల్పించే వాహనాలు, పరికరాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో వాటన్నింటికీ మరమ్మతులు చేయించడంతోపాటు నష్టపరిహారాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. భవిష్యత్తులో ఏవైనా ప్రకృతి విపత్తులు తలెత్తి ప్రజలు, రైతులు, వ్యాపారులు నష్టపోతే వారికి ఆర్థిక సహాయం అందించాలని తాజాగా చంద్రబాబు నిర్ణయించారు. గతేడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వరద బాధితులకు ఎంత నష్టపరిహారం అందజేశామో, వాటిని భవిష్యత్తులోను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

రెట్టింపు సాయాన్ని అందిస్తున్న ప్రభుత్వం
ప్రకృతి విపత్తుల వల్ల మరణించినవారికి రూ.5 లక్షలు అందజేయనున్నారు. ఇల్లు వరదలో మునిగిపోతే రూ.10వేలు, కోటిరూపాయలపైన టర్నోవర్ ఉంటే ఎంఎస్ఎంఈలకు రూ.లక్షన్నర, కోటిరూపాయల్లోపు అయితే రూ.లక్ష, రూ.40 లక్షలలోపు టర్నోవర్ ఉన్నవి మునిగిపోతే రూ.50వేలు, ముడిసరకు నష్టపోయినవారికి రూ.10వేలు, దుకాణానికి రూ.25వేలు, చేనేత వృత్తులవారికి రూ.25వేలు అందిస్తారు. గతంలో ఎంతైతే పరిహారం అందించామో వాటిని రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.

AP government doubles crop damage compensation

తమలపాకు తోటకు రూ.75వేలు
రైతులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమలపాకు తోటలు దెబ్బతింటే రూ.75వేలు, మామిడి, దానిమ్మ, నిమ్మ, అరటి, దానిమ్మ, సపోటా, మిరప, కాఫీ, కంద తదితర పంటలకు రూ.35వేలు, పూలతోటలు, నర్సరీలు, కొత్తిమీర తోటలు, కూరగాయలు, టమాటా, పుచ్చకాయ, బొప్పాయి లాంటి తోటలు దెబ్బతింటే హెక్టారుకు రూ.25వేలు, పట్టు పరిశ్రమకు రూ.25వేలు, ఆయిల్ పామ్ తోపాటు కొబ్బరిచెట్టుకు రూ.1500 అందిస్తారు. కోడి చనిపోతే రూ.100, పశువుల షెడ్ దెబ్బతింటే రూ.5వేలు, ఎద్దులు మరణిస్తే రూ.40వేలు, ఆవులు, గేదెలు మరణిస్తేరూ.50వేలు, దూడలకు రూ.25వేలు, మత్స్యకారులకు సంబంధించి పడవ దెబ్బతింటే మరమ్మతుకు రూ.10వేలు, మోటారు పడవకు రూ.25వేలు, చేపల చెరువుల్లో పూడికతీతకు హెక్టారుకు రూ.18వేలు, గొర్రెలు, మేకలు చనిపోతే రూ.7500 అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+