ఆ రెండు జిల్లాల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు జిల్లాల్లో ప్రత్యేకంగా సెలవు ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేరళ, పుదుచ్చేరీ, అస్సాంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 23న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో తొలి విడత ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరగుతోంది. ఈ సమయంలో రెండు జిల్లాలకు సంబంధించి.. ఓటు హక్కు కలిగిన వారికి సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని తమిళనాడులో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులకు ఈ నెల 23న అధికారికంగా సెలవు మంజూరు చేసింది. వారందరికీ తమ సొంత రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ సెలవు కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగాలకు కూడా వర్తిస్తుంది. రాష్ట్రంలోని అన్ని రకాల ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, ఇతర సంస్థలలో పనిచేస్తున్న అర్హులైన కార్మికులకు, ఉద్యోగులకు పోలింగ్ రోజున పెయిడ్ హాలిడే ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓటు వేయడానికి వెళ్లే ఉద్యోగుల జీతంలో ఎటువంటి కోత విధించకూడదని యాజమాన్యాలకు సూచనలు జారీ అయ్యాయి.

తమిళనాడు ఎన్నికల వేళ ప్రత్యేక సెలవు
తమిళనాడు ఓటర్ల కోసం 23న ప్రత్యేక సెలవు వర్తించనుంది. ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నా.. సొంత ప్రాంతంలో ఉన్న ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెసులు బాటు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు సుదూర ప్రాంతాలకు ప్రయాణించి ఓటు వేయడానికి తగిన సమయం కల్పించడమే ఈ ఉత్తర్వుల ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో అర్హులైన ఓటర్లకు సెలవు మంజూరు చేసారు. ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఉద్యోగికి సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు. ఇక.. ప్రభుత్వ విద్య సంస్థలకు ఈ నెల 23 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.












Click it and Unblock the Notifications