ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం - ఇక నుంచి కొత్తగా..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో సేవను తీసుకొచ్చింది. ఈ సారి రాష్ట్రంలోని గర్భిణులకు అత్యాధునిక టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ (టిఫా) స్కానింగ్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కాన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కార్డుదారులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా అందించనున్నారు.

ఏపీ ప్రభుత్వం తాజాగా గర్భిణులకు శుభవార్త చెప్పింది. ఆరోగ్య శ్రీ ద్వారా గతంలో అందిస్తున్న చికిత్సను భారీగా విస్తరించింది. అనేక మార్పులు తీసుకొచ్చింది. పలు రకాల జబ్బులను ఈ పధకం పరిధిలోకి తీసుకొచ్చింది. అదే సమయంలో నవరత్నాలతో పాటుగా అనేక సంక్షేమ పథకాలు మహిళలకు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మరో నిర్ణయం ప్రకటించింది. గర్భిణీలకు చేసే పరీక్షలను ఉచితంగా అందించాలని డిసైడ్ అయిది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కార్డుదారులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు టిఫా స్కాన్ ను అందించాలని నిర్ణయించింది. ఈ స్కాన్ కోసం ఏపీ ప్రభుత్వం రూ.1,100, అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్‌కు రూ.250 చొప్పున ఖర్చు చేయనుంది.

సాధారణంగా ఈ స్కానింగ్ పరీక్షలను గర్భం దాల్చిన 18 నుంచి 22 వారాల గర్భస్థ దశలో నిర్వహిస్తారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో లబ్ధిదారులైన గర్భిణులకు పై సమస్యలు ఉంటే వైద్యుల సూచన మేరకు ఒక టిఫా స్కాన్, రెండు అల్ట్రాసోనోగ్రామ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. సమస్యలేమీ లేని వారికి మూడు అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్‌లు చేస్తారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులైన మహిళలు అందరూ ఈ సేవలను వినయోగించుకొనే అవకాశం కల్పించారు. గర్భిణులకు టిఫా, అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్ చేయడానికి వీలుగా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొనే వీలుగా కసరత్తు పూర్తి చేసారు. దీని పైన నెట్ వర్క్ ఆస్పత్రులకు మార్గదర్శకాలు జారీ చేసారు.












Click it and Unblock the Notifications