విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో ఆ నాలుగు జిల్లాల్లో పరిస్ధితి చేయిదాటిందా ? సర్కారు ప్రత్యేక ఫోకస్..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం కనిపిస్తోంది. అయితే మిగతా వాటితో పోలిస్తే నాలుగు జిల్లాల్లో మాత్రం పరిస్ధితి తీవ్రత అధికంగా ఉంది. వీటిలో నమోదవుతున్న కేసుల తీవ్రత అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అది ఏ స్ధాయిలో ఉందంటే ఈ నాలుగు జిల్లాల్లో కరోనా అదుపులోకి వస్తే రాష్ట్రంలో పరిస్దితి నియంత్రణలోకి వచ్చినట్లే అని అధికారులు సైతం భావిస్తున్నారు. దీంతో ఈ నాలుగు జిల్లాల్లో వేల సంఖ్యలో కరోనా టెస్టులకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది.

 నాలుగు జిలాల్లో పరిస్ధితి తీవ్రం..

నాలుగు జిలాల్లో పరిస్ధితి తీవ్రం..

ఏపీలోని నాలుగు జిల్లాల్లో కరోనా వైరస్ తీవ్రత అత్యధికంగా ఉంది. వీటిలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలు తొలి నాలుగు స్ధానాల్లో ఉన్నాయి. వీటిలోనే దాదాపు 70 శాతం కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగు జిల్లాల్లో కేసులను నియంత్రించగలిగితే ఏపీలో పరిస్ధితి అదుపులోకి వస్తుందని ప్రభుత్వం భావించేంతగా ఇక్కడ కేసులు నమోదవుతున్నాయి. ఇవి కూడా తొలి రెండు స్టేజ్ లను దాటి మూడో స్టేజ్ లోకి ప్రవేశించినట్లు అనుమానాలు కూడా ఉన్నాయి.

 భారీ స్ధాయిలో పరీక్షలకు రంగం సిద్ధం..

భారీ స్ధాయిలో పరీక్షలకు రంగం సిద్ధం..

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలంటే భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించి రోగులను గుర్తించడమే అసలు సమస్య. దీంతో తాజాగా కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల సాయంతో వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నాలుగు జిల్లాల్లో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ నాలుగు జిల్లాల్లో వచ్చే మూడు నుంచి నాలుగు రోజుల్లోనే 17500 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తామని పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ నాలుగు జిల్లాలపై స్పెషల్ ఫోకస్ ఉంటుందన్నారు.

 సామాజిక వ్యాప్తిపై అనుమానాలు...

సామాజిక వ్యాప్తిపై అనుమానాలు...

కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న నాలుగు జిల్లాల్లో పరిస్దితిని గమనిస్తే వైరస్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా పాజిటివ్ గా గుర్తించిన రోగి ప్రయాణ చరిత్రను చెప్పలేని పరిస్ధితుల్లో అతనికి సామాజికంగా కరోనా వైరస్ వ్యాపించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి రోగుల సంఖ్య పెరుగుతుండటంతో కరోనా స్టేజ్ 3లోకి వెళ్లిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటిని కచ్చితంగా ప్రకటించే పరిస్ధితి లేదు. ప్రజల్లో నెలకొన్న అనుమానాల నేపథ్యంలో స్టేజ్ 3పై ప్రకటన చేస్తే ఆందోళన మరింత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Recommended Video

Fake News Buster 09 : మీ సేవ లో రేషన్ కార్డ్ లు ఇస్తున్నారా?

English summary
andhra pradesh government is now put special focus on four coronavirus affected districts which recorded highest number of cases so far. kurool, nellore, guntur, krishna districts have been recorded 70 percent of the total cases in the state. hence, govt to hold more number of tests in next few days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X